Krish Jagarlamudi: హైదరాబాద్ డాక్టర్‌ని రెండో పెళ్లి చేసుకున్న క్రిష్ జాగర్లమూడి, ఆమెకు 11 ఏళ్ల కొడుకు

తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రీతి చల్లా అనే హైదరాబాద్ డాక్టర్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. గతంలోనే ఈమెకు వివాహం జరిగినప్పటికీ.. పలు కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుంది.

Krish Jagarlamudi: హైదరాబాద్ డాక్టర్‌ని రెండో పెళ్లి చేసుకున్న క్రిష్ జాగర్లమూడి, ఆమెకు 11 ఏళ్ల కొడుకు
Telugu director Krish Jagarlamudi married a doctor named Preeti Challa for the second time

తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రీతి చల్లా అనే హైదరాబాద్ డాక్టర్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. గతంలోనే ఈమెకు వివాహం జరిగినప్పటికీ.. పలు కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుంది. ఈమెకు 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడట. ఇద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.

నారా లోకేష్‌ని కించపరిచేలా పోస్టులు, దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు, ఫిర్యాదు చేసిన టీడీపీ నేత

2008లో వచ్చిన 'గమ్యం' సినిమాతో దర్శకుడిగా మారిన క్రిష్.. వేదం, కొండపొలం, గౌతమిపుత్ర తదితర చిత్రాలు తీశాడు. 16 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ హిట్స్ అయితే కొట్టలేకపోయాడు. మధ్యలో రమ్య అనే డాక్టర్‌ని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ బంధం ఎంతో కాలం నిలబడలేదు. విభేదాల కారణంగా వీళ్లిద్దరూ విడిపోయారు. రమ్య.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని యూఎస్‌లో సెటిల్ అయిపోయింది.

(The above story first appeared on LatestLY on Nov 11, 2024 09:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).