Chandu-Trinayani (Credits: X)

Hyderabad, May 18: త్రినయని (Trinayani) సీరియల్ నటుడు చందు (చంద్రకాంత్‌) బలవన్మరణానికి  పాల్పడ్డారు. అల్కాపూర్‌ కాలనీలో శుక్రవారం ఆయన తన ఇంట్లో ఫ్యాన్‌ కు ఉరివేసుకొని ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన త్రినయని సీరియల్‌ మరో నటి పవిత్ర జయరాంతో చందూ ఆరేండ్లుగా సహజీవనం చేస్తున్నట్టు చెప్తున్నారు. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోవాలని అనుకున్నారని వార్తలు వచ్చాయి. గత వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి చెందింది. ఆమెతోపాటు అదే వాహనంలో ఉన్న చందూ గాయాలతో బయటపడ్డాడు.

తెలంగాణ రాష్ట్రం సంక్షిప్త నామం మార్పు.. ఇప్పటివరకూ ఉన్న టీఎస్ ఇకపై టీజీ.. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో ఈ మార్పులు చేయాల్సిందే.. సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు.. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ మార్పు

ఆమె పిలుస్తున్నదంటూ..

రెండు రోజుల క్రితం పవిత్ర పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఆమె నన్ను పిలుస్తున్నది’ అంటూ సోషల్‌ మీడియాలో చందూ పోస్ట్‌ పెట్టాడు. ఇంతలోనే బలవన్మరణానికి పాల్పడటం అందరికీ షాక్ ఇస్తున్నది. కాగా, చందు త్రినయని, రాధమ్మ పెళ్లి, కార్తీకదీపం వంటి సీరియల్స్‌ లో నటించారు.

వణికిస్తున్న డెంగ్యూ కేసులు, బెంగళూరులో హైఅలర్ట్, నగరంలో ఏకంగా 172 డెంగ్యూ కేసులు నమోదు