Hyderabad, May 18: తెలంగాణ రాష్ర్టాన్ని (Telangana) సూచించే అధికారిక సంక్షిప్త నామానికి రేవంత్ ప్రభుత్వం (Revanth Government) మార్పులు చేసింది. ఇప్పటివరకూ ‘టీఎస్’గా ఉన్న సంక్షిప్త నామాన్ని ఇకపై ‘టీజీ’గా (TS to TG) మారుస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో ఈ మార్పులు చేయాలని సూచించారు. జీవోలు, పాలసీ పేపర్లు, నోటిఫికేషన్లు, సర్క్యులర్లు, లెటర్ హెడ్స్, అధికారిక పత్రాల్లో టీజీ వచ్చేలా చూడాలని ఆదేశించారు. ఇప్పటికే టీఎస్ పేరుతో ముద్రించిన పత్రాలను ఏం చేయాలనే దానిపై ఈ నెలాఖరుకు నివేదిక అందజేయాలని స్పష్టం చేశారు.
వణికిస్తున్న డెంగ్యూ కేసులు, బెంగళూరులో హైఅలర్ట్, నగరంలో ఏకంగా 172 డెంగ్యూ కేసులు నమోదు
తెలంగాణలో ఇక టీఎస్ స్థానంలో టీజీ#TeluguNews #ABPDesam #Telangana #TsNumberPlates #TGNumberPlates #TSChangedToTG #TGRegistration pic.twitter.com/LItm5eONqb
— ABP Desam (@ABPDesam) May 17, 2024
ఇప్పటికే మారిన వాహనాల నంబర్
తెలంగాణలోని వాహనాల నంబర్ ప్లేట్లపై టీఎస్ స్థానంలో టీజీ ఉండేట్లు ఇదివరకే మార్పులు జరిగాయి. ఈ మేరకు వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో రాష్ట్ర కోడ్‌గా టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.