Dengue (photo-Pixabay)

Bengaluru Records 172 dengue cases in May: కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరంలో డెంగ్యూ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో హై అలర్ట్ ప్రకటించినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలిక సంస్థ కమిషనర్ వికాస్ కిషోర్ వెల్లడించారు. డెంగ్యూ వైరస్ విస్తరించకుండా నివారణ చర్యలు ఇప్పటికే చేపట్టినట్లు తెలిపారు.

మే 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బెంగళూరు నగరంలో ఏకంగా 172 డెంగ్యూ కేసులు బయటపడ్డాయి. దీంతో నగరంలో హై అలర్ట్ (high alert) ప్రకటించారు. ఇటీవల నగరంలో భారీ వర్షాలు కురిశాయని.. దీంతో పలు ప్రాంతాల్లో నీరు నిల్వ వల్ల ఈ వైరస్ వ్యాపించిందన్నారు. ఇక మే 16వ తేదీ జాతీయ డెంగ్యూ దినోత్సవమని.. ఈ నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తిపై అరికట్టేందుకు నగర ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని కిషోర్ వివరించారు. అలాగే నగరంలో నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను సైతం గుర్తించి.. ఆ యా ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కమిషనర్ వికాస్ కిషోర్ పేర్కొన్నారు.  కేరళలో ప్రమాదకరంగా మారిన హెపటైటిస్‌ ఎ వైరస్‌, ఇప్పటికే 12 మంది మృతి, లక్షణాలు, చికత్స గురించి తెలుసుకోండి

ఇక ఈ డెంగ్యూ వైరస్ బెంగళూరు మహానగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉందన్నారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి నేటి వరకు 2,877 డెంగ్యూ కేసులు నమోదు అయితే.. గతేడాది ఇదే సమయంలో 1,725 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని గుర్తు చేశారు. ఈ డెంగ్యూ కేసులు నివారణకు కర్ణాటక ఆరోగ్య విభాగం ప్రత్యేక చర్యలు చేపట్టిందని బెంగళూరు మహానగర పాలిక సంస్థ కమిషనర్ వికాస్ కిషోర్ తెలిపారు.  కోవిషీల్డ్ టీకాతో ప్రాణాంతక వీఐటీటీ, అరుదైన ప్రాణాంతక రుగ్మతకు దారితీస్తున్న వ్యాక్సిన్, ఆస్ట్రేలియా పరిశోధనలో మరిన్ని కొత్త విషయాలు

వర్షం పడిన తర్వాత నీరు నిలవడంతో దోమలు వృద్ధి చెందుతాయి. దోమల కారణంగా వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. దీంతో నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాం. రసాయనాలు పిచికారీ చేయించాం’ అని వికాస్‌ కిషోర్‌ తెలిపారు.