Vaishali Takkar Suicide: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బెస్ట్ ఫ్రెండ్ ఆత్మహత్య, సుశాంత్ మరణంపై అప్పట్లో సంచలన కామెంట్లు చేసిన వైశాలి ఠక్కర్, ప్రేమ వ్యవహారమే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా?
వైశాలి ఠక్కర్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు బెస్ట్ ఫ్రెండ్. అతని మరణంపై అప్పట్లో ఆమె అనుమానాలు వ్యక్తం చేసింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తెలిపింది. అతని మరణం వెనుక చాలామంది ప్రమేయం ఉందని ఆరోపించింది. సుశాంత్‌ని మర్డర్ చేశారని.. దీని వెనుక అతని గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి పాటు మరికొందరు ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది.
Mumbai, OCT 16: బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ టీవీ నటి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushanth singh Rajput) స్నేహితురాలు వైశాలి ఠక్కర్ (Vaishali Takkar) ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఆమె మరణం టీవీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. చాలా హిందీ సీరియల్స్‌లో నటించిన వైశాలి గత ఏడాది కాలంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ఉంటున్నారు. తన ఇంట్లో ఉరివేసుకొని వైశాలి ఠక్కర్ ఆత్మహత్యకు (Vaishali Takkar Suicide) పాల్పడినట్టు తేజాజీ నగర్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైశాలి నివాసం నుంచి పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమే 30 ఏళ్ల వైశాలి ఠక్కర్ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు.
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని (Ujjain) వైశాలి ఠక్కర్ స్వస్థలం. వైశాలి టక్కర్ ‘ససురల్ సిమర్ కా’లో (sasural simar ka) అంజలి భరద్వాజ్.. ‘సూపర్ సిస్టర్స్’లో (Super Sharma) శివానీ శర్మ, ‘విషయా అమృత్: సితార’లో నేత్రా సింగ్ రాథోడ్, ‘మన్మోహిని 2’లో అనన్య మిశ్రా లాంటి పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్‌లో కూడా పాల్గొంది.
వైశాలి ఠక్కర్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు బెస్ట్ ఫ్రెండ్. అతని మరణంపై అప్పట్లో ఆమె అనుమానాలు వ్యక్తం చేసింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తెలిపింది. అతని మరణం వెనుక చాలామంది ప్రమేయం ఉందని ఆరోపించింది. సుశాంత్‌ని మర్డర్ చేశారని.. దీని వెనుక అతని గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి పాటు మరికొందరు ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేసి.. అప్పట్లో సంచలనంగా మారింది.
(The above story first appeared on LatestLY on Oct 16, 2022 05:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

