Hyderabad, OCT 14: బాలయ్య హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్ షో (Unstoppable) భారీ హిట్ అయి రికార్డులని కూడా సాధించడంతో ఈ షోకి సీజన్ 2ని కూడా ప్రకటించి గ్రాండ్ లాంచ్ చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 (Unstoppable-2) లో మొదటి ఎపిసోడ్ లో అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా చంద్రబాబు (Chandrababu), లోకేష్ (Lokesh) ని తీసుకొచ్చారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, తాజాగా నేడు ఆహాలో (Aha) మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఎపిసోడ్ రిలీజైన కొద్దిసేపటికే ఇది వైరల్ గా మారింది. ఇక మొదటి ఎపిసోడ్ లో మాజీ సీఎం, బాలకృష్ణకు బావ అయిన చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. షోలో ఎన్నో సరదా విషయాలు, రాజకీయాలు మాట్లాడారు. చంద్రబాబు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచారని, ఎన్టీఆర్ కి ద్రోహం చేసారని కొంతమంది అంటారు. ఇది చాలా వివాదాస్పద అంశం. అయితే ఈ విషయం అన్‌స్టాపబుల్ షోలో మాట్లాడటం గమనార్హం. బాలకృష్ణ (Balakrishna) ఈ అంశాన్ని కూడా గుర్తుచేశాడు. దీంతో చంద్రబాబు ఆ అంశంపై చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ మాట్లాడారు.
Big decisions - Big moments🔥
Witness the legendary @ncbn and #Unstoppable #NandamuriBalakrishna in talking, their heart out.@naralokesh#UnstoppableWithNBKS2 episode 1 streaming now.
▶️https://t.co/bOcHMUlL7f#NBKOnAHA pic.twitter.com/FirEA5Nq8O
— ahavideoin (@ahavideoIN) October 14, 2022
చంద్రబాబు మాట్లాడుతూ.. 1995లో అప్పుడు నువ్వు కూడా ఉన్నావు. ఎన్టీఆర్ ఒక ఆశయం కోసం పార్టీ పెట్టి పోరాడి ముందుకెళ్లారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి పనిచేశాము. ఎమ్మెల్యేలు కొంతమంది రివర్స్ అయ్యారు. నేను, నువ్వు, హరికృష్ణ, కొంతమంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్(NTR) గారి దగ్గరికి వెళ్ళాం. ఫ్యామిలీ అయితే మీ ముగ్గురు ఉండండి, రాజకేయం అయితే నన్నొక్కడ్నే ఉండమంటే మీరు బయటకి వెళ్లిపోయారు. మూడు గంటలు మాట్లాడాను. సమస్యలు చెప్పాను, మీటింగ్ పెట్టమన్నాను, ఆయన కాళ్ళు పట్టుకున్నాను, కానీ వినలేదు. మా ఇద్దరిది రామాంజనేయ యుద్ధం లాంటిది. రాముడి మాట కోసం అంజనేయ స్వామి రాముడితోనే యుద్ధం చేశాడు. అలా అని ఆంజనేయుడికి రాముడు దేవుడు కాకుండా పోతాడా? నాకు ఆయన దేవుడే. ఆ రోజు పార్టీ కోసం ఆయనతో విబేధించాను. ఆయన సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లాలి. ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తీసుకున్నది తప్పా. ఆయన చెప్పింది ప్రతిదీ చేశాను. ఆయన నాకు ఆరాధ్యదైవం. ఆయనకి నా మీద నమ్మకం ఉంది. ఇది చరిత్ర. మనం తీసుకున్న నిర్ణయం తప్పా అని బాలకృష్ణని ఎదురు ప్రశ్నించారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. ముమ్మాటికీ కాదు, నందమూరి కుటుంబ సభ్యుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, తెలుగుదేశం కార్యకర్తగా, ఆయన అభిమానిగా చెప్తున్నా మీరు తీసుకున్న నిర్ణయం కరక్ట్. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల విజయమే మన నిర్ణయం కరెక్ట్ అని చెప్పింది. ఆయన ఎక్కడున్నా మన అందరి మధ్యలో ఉన్నారు. చరిత్ర ఉన్నంతవరకు ఆయన ఉంటారు. ఇది మీ డెసిషన్ కాదు, మన డెసిషన్, మన పార్టీ డెసిషన్ అని చెప్పారు.
ఇక చంద్రబాబు ఎన్టీఆర్ గారు లేకపోయినా ఆయన ఆశయాల సాధన కోసం తెలుగుదేశం పార్టీ (Telugu desham Party) నిరంతరం పనిచేస్తుంది అని తెలిపారు. దీంతో ఎన్నో ఏళ్ళ నుంచి చంద్రబాబుకి నెగిటివ్ గా ఉన్న ఈ అంశం మరి ఈ షో చూసిన తర్వాత పాజిటివ్ గా మారుతుందేమో చూడాలి. ఇప్పటికే పలువురు వైసిపి నాయకులు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ చంద్రబాబుని విమర్శించడం మొదలుపెట్టారు. చంద్రబాబు, బాలకృష్ణ ఎన్టీఆర్ సంఘటనపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చగా మారాయి.