Hyd, January 2: బాలయ్య హోస్ట్‌గా ఆహాలో అన్‌స్టాపబుల్ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ షోకు చాలామంది ప్రముఖులు హాజరుకాగా త్వరలో రామ్ చరణ్ సైతం అతిథగా రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌పై అంచనాలు భారీగా పెరిగిపోగా ఇందుకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.
ఈ ఎపిసోడ్ షూటింగ్ నుండి లీక్ అయిన కొన్ని గ్లింప్స్ వైరల్‌గా మారాయి. రామ్ చరణ్ హోస్ట్ నందమూరి బాలకృష్ణ ...ప్రభాస్‌కు ఫోన్ చేస్తూ కొన్ని సరదా సంభాషణలు చేస్తున్నట్లు చూడవచ్చు. అలాగే గేమ్ ఛేంజర్ సినిమా గురించిన ప్రస్తావన వీరిద్దరి మధ్య వచ్చింది. క్యాన్సర్‌ను జయించిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, భార్యతో కలిసి స్పెషల్ వీడియో రిలీజ్
గతంలో ఇదే షోకి గెస్ట్‌గా వచ్చారు ప్రభాస్. అప్పుడు బాలయ్య ..రామ్ చరణ్‌కు ఫోన్ చేయగా డార్లింగ్ ప్రభాస్‌ని బుక్ చేశాడు. ఇప్పుడు ప్రభాస్ వంతు రావడంతో రామ్ చరణ్‌ని కూడా బుక్ చేసినట్లు తెలుస్తోంది.
Ram Charan call to Prabhas for Game Changer promotions
Phone Call to Darling #Prabhas in Unstoppable Show
Revenge plan chesar anamata 😅😂#UnstoppableWithNBK pic.twitter.com/LRF9yIswhm
— Vinay🦅 (@vinayHere3) January 1, 2025
వాస్తవానికి రామ్ చరణ్ - పరభాస్ ఇద్దరూ స్నేహితులన్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇది రామ్ చరణ్ కెరీర్‌లో 16వ సినిమా. మరోవైపు ప్రభాస్... ది రాజా సాబ్, ఫౌజీ, సాలార్ 2 మరియు కన్నప్ప వంటి అనేక సినిమాల్లో నటిస్తున్నాడు.