Devarakonda Bumper Offer: అభిమానులకు రౌడీ హీరో బంపర్ ఆఫర్.. 100 మందిని విహార యాత్రకు పంపనున్నట్లు ప్రకటన

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి అభిమానులను సంతోషంలో ముంచెత్తే ప్రకటన చేశాడు. క్రిస్మస్ గిఫ్ట్ గా తన అభిమానులు వందమందిని విహార యాత్రకు పంపించనున్నట్లు తెలిపాడు.

Devarakonda Bumper Offer: అభిమానులకు రౌడీ హీరో బంపర్ ఆఫర్.. 100 మందిని విహార యాత్రకు పంపనున్నట్లు ప్రకటన
Vijay (Credits: Twitter)

Hyderabad, Dec 27: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మరోసారి అభిమానులను (Fans) సంతోషంలో ముంచెత్తే ప్రకటన చేశాడు. క్రిస్మస్ గిఫ్ట్ (Christmas Gift) గా తన అభిమానులు వందమందిని విహార యాత్రకు (Holiday Trip) పంపించనున్నట్లు తెలిపాడు.  ఐదేళ్లుగా దేవరసాంటా (Devara Santa) పేరుతో ప్రతీ క్రిస్మస్ కు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ.. తాజాగా తన ఖర్చుతో అభిమానులను విహారయాత్రకు పంపిస్తానని వెల్లడించాడు.

జబర్దస్త్ కిర్రాక్ ఆర్పీ, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ఓపెన్ చేసి, ఒక్క నెలలో ఎంత సంపాదించాడో తెలిస్తే, షాక్ తింటారు..

ఎక్కడికి పంపిస్తే బాగుంటుందంటూ ట్విట్టర్ లో ఓ పోల్ నిర్వహించగా.. వేలాదిమంది అభిమానులు స్పందించారు. దేశంలోని పర్వత ప్రాంతాలను చుట్టి రావడానికే ఎక్కువమంది ఓటేశారు. ట్విట్టర్ లో నిర్వహించిన ఈ పోల్ లో సుమారు 31 వేల మందికి పైగా విజయ్ దేవరకొండ అభిమానులు పాల్గొన్నారు.

జబర్దస్త్ లోకి రాకుండా సుడిగాలి సుధీర్ వెనుక పెద్ద కుట్ర నడుస్తోందా, రీఎంట్రీకి అడ్డుపడుతోంది ఎవరు..?

అందులో మెజారిటీ శాతం.. అంటే 42.5 శాతం మంది పర్వత ప్రాంతాల పర్యటనకు ఓటేయగా, సముద్ర తీర ప్రాంతాల పర్యటనకు పంపాలని 24 శాతం మంది, సాంస్కృతిక పర్యటనే మేలంటూ 27.1 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే, విహార యాత్రకు పంపించే వంద మంది అభిమానులను ఎలా ఎంపిక చేస్తారనే విషయం మాత్రం విజయ్ దేవరకొండ వెల్లడించలేదు.

(The above story first appeared on LatestLY on Dec 27, 2022 10:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).