కిరాక్ ఆర్పీ జబర్దస్త్ లో ఓ సంచలనం అనే చెప్పవచ్చు, తనదైన కామెడీ టైమింగ్ తో ఆర్ పి జబర్దస్త్ లో టీం లీడర్ స్థాయివరకూ ఎదిగాడు. నాగబాబు కు అత్యంత సన్నిహితుడిగా పేరు సంపాదించుకున్న ఆర్ పి, ఆ తర్వాత నాగబాబు తో పాటు జబర్దస్త్ వదిలేసి జీతెలుగు తో ట్రావెల్ అయ్యాడు. అక్కడ షో ఆగిపోవడంతో, ఆ తర్వాత స్టార్ మా లో ఆర్ పి కనిపించాడు. నిజానికి కిరాక్ ఆర్పి ఒక డైరెక్టర్ అవ్వాలని సినిమా కూడా స్టార్ట్ చేసి, ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెనింగ్ కోసం సినీ ప్రముఖులతో పాటు, నాగ బాబు ని సైతం ముఖ్యఅతిథిగా పిలిచాడు. కానీ ఏమైందో తెలియదు సినిమా ప్రొడక్షన్ అటకెక్కింది
.ఇప్పుడు స్టార్ మా లో సైతం ఆర్ఆర్బీ మాయం అయిపోయాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆర్ పి, సడన్గా ఓ కర్రీ పాయింట్ పెట్టి సక్సెస్ అవుతున్నాడు. సోషల్ మీడియాలో తనకు ఉన్న ఇమేజ్ ను ఉపయోగించుకొని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఓ కర్రీ పాయింట్ స్థాపించి, చక్కటి సక్సెస్ అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ యూట్యూబ్ చానల్స్ కు తన కర్రీ పాయింట్ చేపల పులుసు గురించి వివరిస్తూ బాగా పబ్లిసిటీ చేయడంతో, ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ చాలా ఫేమస్ అయిపోయింది. దీంతో అటు భోజనప్రియులు సైతం చేపల పులుసు రుచి చూసేందుకు కర్రీ పాయింట్ ముందు లైన్లు కట్టడం విశేషం.
నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ స్థాపించడానికి తనకు 40 లక్షలు ఖర్చయిందని, అయితే పెట్టిన పెట్టుబడి కేవలం నెల రోజుల్లోనే సంపాదించినట్లు కిర్రాక్ ఆర్పీ చెప్పడం విశేషం. అంతేకాదు కిర్రాక్ ఆర్పీ, త్వరలోనే మరిన్ని బ్రాంచీలను సైతం స్థాపించనున్న ట్లు ప్రకటించడం విశేషం. టీవీ, సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవుదామని అడుగుపెట్టి అవకాశాలు కరువైనా కుంగిపోకుండా కర్రీ పాయింట్ ద్వారా సక్సెస్ అవ్వడాన్ని ఆర్పీ శ్రేయోభిలాషులు అభినందిస్తున్నారు. అంతేకాదు కిర్రాక్ ఆర్పీ మళ్ళీ టెలివిజన్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వాలని వారంతా ఆశిస్తున్నారు.