Jabardasth Sudigali Sudheer: జబర్దస్త్ లోకి రాకుండా సుడిగాలి సుధీర్ వెనుక పెద్ద కుట్ర నడుస్తోందా, రీఎంట్రీకి అడ్డుపడుతోంది ఎవరు..?
(Photo-Video Grab)

సుడిగాలి సుధీర్ అంటే జబర్దస్త్ లో  ఒక స్టార్ అనే చెప్పాలి. జబర్దస్త్ కామెడీ షో ద్వారా హీరోగా ఎదిగిన వ్యక్తి సుడిగాలి సుదీర్.  కమెడియన్ గా  ఒక టీం లో కంటెస్టెంట్ గా ప్రయాణం ప్రారంభించిన సుడిగాలి సుదీర్,  నేడు ఇండస్ట్రీలో ఒక హీరో గా చలామణి అవుతున్నాడు.  తాను సినిమాల్లో హీరో అయినప్పటికీ,  జబర్దస్త్ మర్చిపోకుండా  చాలాకాలం టీం లీడర్ గా కొనసాగాడు.  కానీ స్టార్ మా నుంచి అదిరిపోయే ఆఫర్ రావడంతో ఇప్పుడు అక్కడ వాలిపోయాడు.  కానీ ఏమైందో తెలియదు.  స్టార్ మా నుంచి కూడా సుడిగాలి సుదీర్ బయటకు వచ్చేశాడు.  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్టార్ మాకు  కేవలం తాత్కాలికంగా మాత్రమే వెళ్లానని.  ఇప్పుడు అక్కడ పనేమీ లేదని,  తనకు కొన్ని సినిమా కమిట్మెంట్స్ వల్ల  మల్లెమాలకు  దూరమయ్యానని.,  సుధీర్ ఇంటర్వ్యూ లో చెప్పాడు. 

ఇదంతా బాగానే ఉంది.  సుడిగాలి సుదీర్ జబర్దస్త్ లోకి  రీ ఎంట్రీ ఇస్తానని పలు ఇంటర్వ్యూలలో చెప్పడం విశేషం.  ఇప్పటికే సుదీర్ మల్లెమాల కు చెందిన శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఓసారి తళుక్కు మనడం విశేషం. 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో 5గురికి నోటీసులు, విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్‌ చేస్తామని హెచ్చరికలు జారీ చేసిన సిట్

 ఇదంతా బాగానే ఉంది,  కానీ సుధీర్ జబర్దస్త్ ఎంట్రీ ఎప్పుడు అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.  సుధీర్ రెడీ గానే ఉన్నప్పటికీ,  మల్లెమాల సైడ్ నుంచి మాత్రం ఎలాంటి గ్రీన్ సిగ్నల్ అందడం లేదని,  అందుకే సుదీర్ దూరంగా ఉన్నట్లు  బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి. 

మల్లెమాల తమ కాంట్రాక్ట్ బ్రేక్ చేసి వెళ్లిన వారి పట్ల చాలా కఠినంగా ఉంటుందని,  గతంలో జబర్దస్త్ వదిలివెళ్లిన ధనరాజ్,  వేణు,చమ్మక్ చంద్ర,  చలాకి చంటి లాంటివారు,  రీ ఎంట్రీ ఇవ్వాలని ఎంత ప్రయత్నించినా మల్లెమాల  ఒప్పుకోలేదని బయట టాక్ నడుస్తోంది.  దీనికి కారణం లేకపోలేదు మల్లెమాల తమ ఆర్టిస్టుల విషయంలో చాలా కఠినంగా ఉంటుందని.  ఇప్పటికే బయటకు వెళ్లి పోయిన కిరాక్ ఆర్పీ పలు ఆరోపణలు చేశారు. 

అయితే సుడిగాలి సుదీర్, అటు సినిమాలు,  జబర్దస్త్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చాలా సంవత్సరాలు గడిపాడు. కానీ సుధీర్ ఓ పెద్ద సినిమా కమిట్ అవడం వల్లనే  జబర్దస్త్ నుంచి బయట పడాల్సి వచ్చిందని,  అతని సన్నిహితులు అంటున్నారు.  కానీ త్వరలోనే సుధీర్ జబర్దస్త్ లో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని,  ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు కొందరు మాత్రం మల్లెమాల సుధీర్ విషయంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు తక్కువేనని పెదవి విరుస్తున్నారు.