This Week Movies- OTT Releases: ఈవారం థియేటర్స్ విడుదలైన సినిమాలు, సంక్షిప్త రివ్యూలు, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాల వెబ్ సిరీస్‌ల విశేషాలు ఇవిగో!

This Week Movies- OTT Releases | Pixabay/file

This Week Movies- OTT Releases: ఈవారం మరిన్ని కొత్త సినిమాలు మిమ్మల్ని అలరించనున్నాయి. ఫిబ్రవరి 02, 2024న థియేటర్లలో విడుదలైన సినిమాలు, క్లుప్తంగా వాటి రివ్యూలు, అలాగే ఈరోజు నుంచి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉండనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు, రాబోయే చిత్రాల విశేషాలను ఇక్కడ తెలియజేస్తున్నాం.

ప్రస్తుతం థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ టాక్ తెచ్చుకుంటే తప్పా, అవి అక్కడ మనుగడ సాధిస్తున్నాయి. లేదంటే కొన్ని రోజుల్లోనే OTT ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలకు ముందే డిజిటల్ విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. సాధారణంగా థియేటర్లో విడుదలయిన ఏ సినిమా అయినా కనీసం నెల రోజుల తర్వాత OTTలోకి రావాలి. అయితే గతవారం విడుదలయిన ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ నెలరోజులు కాకముందే OTTలోకి వచ్చేస్తోంది. మరిన్ని సినిమా వివరాలు ఈ కింద చెక్ చేయండి.

ఈవారం థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలు

ఈ వారం చాలా వరకు చిన్న సినిమాలు, మిగిలిపోయిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కాబట్టి వాటి రివ్యూలు ఇక్కడ ఇవ్వడం లేదా? థియేటర్లకు వెళ్లి చూడాలా? ఓటీటీ వరకు ఆగాలా అన్నది మీ ఇష్టం.

అంబాజీపేట మ్యారేజి బ్యాండు (తెలుగు): సుహాస్, శరణ్య తదితరులు నటించారు. కథ, కథనం బాగుందని చాలా మంది రివ్యూలు ఇస్తున్నారు.

కిస్మత్ (తెలుగు): శ్రీనివాస్ అవసరాల, నరేష్ అగస్త్య తదితరులు నటించారు

బూట్ కట్ బాలరాజు (తెలుగు): బిగ్ బాస్ సోహైల్, మేఘలేఖ తదితరులు నటించారు.

హ్యాపీ ఎండింగ్ (తెలుగు): యష్ పూరీ, అపూర్వ రావు తదితరులు నటించిన కామెడీ- ఫాంటసీ మూవీ.

ధీర (తెలుగు): లక్ష్ చదలవాడ, నేహా పఠాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్

వీటితో పాటు మెకానిక్, గేమ్ ఆన్, ఐ హేట్ యూ వంటి సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి.

ఈవారం ఓటీటీలో రిలీజ్ అవుతున్నవి

ఈవారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, త్వరలో రాబోయే సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి..

పిండం: 02 ఫిబ్రవరి 2024 - ఆహా

సైంధవ్: 03 ఫిబ్రవరి 2024 -అమెజాన్ ప్రైమ్

మిస్ పర్ఫెక్షన్ (వెబ్ సిరీస్): 03 ఫిబ్రవరి 2024- డిస్నీ+ హాట్‌స్టార్

బబుల్‌గమ్: 09 ఫిబ్రవరి 2024- ఆహా

కెప్టెన్ మిల్లర్: 09 ఫిబ్రవరి 2024- అమెజాన్ ప్రైమ్

గుంటూరు కారం-త్వరలో- నెట్‌ఫ్లిక్స్

హనుమాన్- త్వరలో- జీ5 ఫిల్మ్

నా సామి రంగ -త్వరలో- డిస్నీ+ హాట్‌స్టార్ ఫిల్మ్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement