Bigg Boss 2026: భాష మారినా ఫీజుల్లో తగ్గేదేలే.. బిగ్‌బాస్ హోస్టుల రెమ్యునరేషన్ చూస్తే షాక్.. సల్మాన్ ఖాన్, సౌరవ్ గంగూలీ టాప్‌లో..

భారతీయ బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్' (Bigg Boss) కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌కే కాకుండా, అందులో హోస్ట్‌లుగా వ్యవహరించే ప్రముఖ తారల పారితోషికాలకు (Remuneration) కూడా అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలుస్తోంది.

Bigg Boss Telugu 8 Grand Finale (Image: Instagram/@akkineninagarjuna7)

Bigg Boss 2026: భారతీయ బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్' (Bigg Boss) కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌కే కాకుండా, అందులో హోస్ట్‌లుగా వ్యవహరించే ప్రముఖ తారల పారితోషికాలకు (Remuneration) కూడా అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలుస్తోంది. హిందీ నుంచి ప్రారంభమై వివిధ ప్రాంతీయ భాషలకు విస్తరించిన ఈ షో, ఇప్పుడు ఆయా చిత్ర పరిశ్రమలలోని టాప్ స్టార్ల పారితోషికాల సరిహద్దులను తిరగరాస్తోంది. ఇటీవల వెలువడిన వివిధ ఆంగ్ల, ప్రాంతీయ మీడియా కథనాల ప్రకారం బిగ్ బాస్ వ్యాఖ్యాతలు అందుకుంటున్న పారితోషికాల వివరాలు నెటిజన్లను, విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సుదీర్ఘకాలంగా హిందీ బిగ్ బాస్ ముఖచిత్రంగా కొనసాగుతున్నారు. బిగ్ బాస్ 20వ సీజన్ మొత్తానికి గాను ఆయన రూ. 120 కోట్ల భారీ పారితోషికం అందుకోనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇక క్రికెట్ దిగ్గజం, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 'బిగ్ బాస్ బంగ్లా' మూడో సీజన్ ద్వారా హోస్టింగ్ బాధ్యతలు చేపట్టగా, స్టార్ జల్సాతో నాలుగేళ్లకు గాను ఏకంగా రూ. 125 కోట్ల మేర ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

వీడియో ఇదిగో.. భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా మరో అమ్మాయితో ప‌ట్టుబ‌డిన ఫోక్ సాంగ్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి.. నా భర్త మంచోడే.. ఆమెనే మీద పడి లొంగదీసుకుందని భార్య ఫిర్యాదు..

కోలీవుడ్‌లో కమల్ హాసన్ ‘బిగ్ బాస్ తమిళ్’ సీజన్ 7 వరకు విజయవంతంగా నిర్వహించి, ఆ సీజన్‌కు గాను దాదాపు రూ. 130 కోట్లు అందుకున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఆయన స్థానంలో సీజన్ 8 బాధ్యతలు చేపట్టిన ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రతి వారాంతపు ఎపిసోడ్‌కు రూ. 3 నుంచి 4 కోట్ల చొప్పున, సీజన్ మొత్తానికి రూ. 75 నుంచి 80 కోట్ల వరకు అర్జిస్తున్నారు.

ప్రాంతీయ భాషల్లో వీకెండ్ హంగామా:

తెలుగు (అక్కినేని నాగార్జున): తెలుగులో ఏడు సీజన్లకు పైగా హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిగ్ బాస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన కింగ్ నాగార్జున, ఒక పూర్తి సీజన్‌కు గాను దాదాపు రూ. 35 కోట్ల నుంచి రూ. 40 కోట్ల వరకు అందుకుంటున్నారు.

మలయాళం (మోహన్‌లాల్): 2018లో బిగ్ బాస్ మలయాళం ప్రారంభం అయినప్పటి నుంచి హోస్ట్‌గా ఉన్న మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, సీజన్‌కు రూ. 30 కోట్లు పారితోషికంగా పొందుతున్నారు.

కన్నడ (కిచ్చ సుదీప్): కన్నడ బిగ్ బాస్ ప్రధాన ఆకర్షణ అయిన నటుడు సుదీప్ ఒక సీజన్‌కు సుమారు రూ. 20 కోట్లు అర్జిస్తున్నారు.

మరాఠీ (రితేష్ దేశ్‌ముఖ్): 2024లో మహేష్ మంజ్రేకర్ స్థానంలో బిగ్ బాస్ మరాఠీ వ్యాఖ్యాతగా అడుగుపెట్టిన రితేష్ దేశ్‌ముఖ్, ప్రతి వారాంతానికి రూ. 50 లక్షల పారితోషికం తీసుకుంటున్నారు.

సినిమాలతో పోలిస్తే తక్కువ సమయంలోనే అధిక ప్రజాదరణతో పాటు రికార్డు స్థాయి రెమ్యునరేషన్లు లభిస్తుండటంతో, ప్రాంతీయ చిత్ర పరిశ్రమల అగ్ర కథానాయకులు బిగ్ బాస్ వ్యాఖ్యాతలుగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ షో కేవలం బుల్లితెర వీక్షకులను అలరించడమే కాక, ఎంటర్టైన్మెంట్ బిజినెస్‌లో అతిపెద్ద వాణిజ్య శక్తిగా ఎదిగిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement