Tunisha Sharma Suicide Case: తునీషా మృతి కేసులో ట్విస్ట్! బాయ్‌ఫ్రెండ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, 15 రోజుల క్రితమే ఇద్దరికీ బ్రేకప్
15 రోజుల క్రితమే షీజాన్ ఖాన్ ఆమెకు బ్రేకప్ చెప్పినట్లు తెలిసింది. బ్రేకప్ జరిగినప్పటి నుంచి తునీషా మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనైందని, దాంతోనే చివరికి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు. తునీషా ఆత్మహత్య చేసుకునేలా షీజాన్ ఖాన్ ప్రేరేపించినట్లుగా అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Mumbai, DEC 25: యువ నటి తునీషా శర్మ మృతి (Tunisha Sharma suicide) కేసులో ఆమె సహ నటుడు షీజాన్ ఖాన్‌ను (Sheezan Khan) పోలీసులు ఇవాళ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ముంబైలోని వాసాయ్ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అతనికి నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. శనివారం ఓ టీవీ సీరియల్ షూటింగ్ సెట్‌లో తునీషా శర్మ ఆత్మహత్య (Tunisha Sharma suicide) చేసుకుంది. షూటింగ్ గ్యాప్‌లో టాయిలెట్స్‌కు అని వెళ్లిన తునీషా శర్మ ఎంతకూ బయటికి రాకపోవడంతో సీరియల్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి చూడగా.. తునీషా మృతదేహం ఉరికి వేలాడుతూ కనిపించింది. దాంతో పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Chalapathi Rao Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత
దర్యాప్తులో తునీషా, ఆమె సహనటుడు షీజాన్ ఖాన్ గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారని తేలింది. 15 రోజుల క్రితమే షీజాన్ ఖాన్ ఆమెకు బ్రేకప్ చెప్పినట్లు తెలిసింది. బ్రేకప్ జరిగినప్పటి నుంచి తునీషా మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనైందని, దాంతోనే చివరికి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు. తునీషా ఆత్మహత్య చేసుకునేలా షీజాన్ ఖాన్ ప్రేరేపించినట్లుగా అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపర్చి కస్టడీ కోరారు. కోర్టు నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించడంతో షీజాన్ ఖాన్‌ను ఇంటరాగేట్ చేస్తున్నారు.
ముంబైలో నిన్న సీరియల్ షూటింగ్ లో పాల్గొన్న తునీషా షూటింగ్ సెట్‌లోని మేకప్ రూమ్‌లో ఉరువేసుకోవడం అందరిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అప్పటి వరకు షూటింగ్‌లో సరదాగా ఉన్న నటి, సడన్‌గా ఉరితాడుకి వేలాడుతూ కనపించడంపై అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఈ కేసుని ఆత్మహత్యగా పరిగణించిన పోలీసులు.. సంఘటన స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరక్కపోవడంతో, దీని హత్యకోణంలో దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే నిన్న షూటింగ్‌లో ఉన్న ప్రతి ఒక్కర్ని విచారించడం మొదలుపెట్టారు పోలీసులు. కాగా సూసైడ్ కి ముందు తునీషా శర్మ.. ఆత్మహత్య సీన్ లో నటించడం విశేషం. అందుకు సంబంధించిన వీడియోని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, ఇప్పుడు అది వైరల్ గా మారింది. ఇక ఈమె మరణ వార్త విన్న అభిమానులు, సహనటులు, సినీప్రముఖులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Dec 25, 2022 03:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

