Chalapathi Rao Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత
టాలీవుడ్ లో వరుసగా విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి 24 గంటలు కూడా గడవక ముందే మరో సీనియర్ నటుడు చలపతిరావు మృతి చెందడంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
Hyderabad, Dec 25: టాలీవుడ్ లో (Tollywood) వరుసగా విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) అంత్యక్రియలు ముగిసి 24 గంటలు కూడా గడవక ముందే మరో సీనియర్ నటుడు చలపతిరావు (Chalapathi Rao) మృతి చెందడంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. చలపతిరావు ఈ తెల్లవారుజామున గుండెపోటుతో (Heart attack) కన్నుమూశారు.
ప్రభుత్వ లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్య క్రియలు పూర్తి
కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నటనకు కూడా దూరంగానే ఉంటున్నారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. 1,200కు పైగా సినిమాలలో చలపతిరావు నటించారు. కృష్ణా జిల్లా బల్లిపర్రులో 1944లో ఆయన జన్మించారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి వార్తతో టాలీవుడ్ షాక్ కు గురైంది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
Another tragedy in Tollywood..
Died due to heart attack in the morning. Senior actor Chalapathy Raob garu passes away
Chalapathy Rao garu acted in more than 1200 films.#ChalapathiRao #RIPChalapathiRao pic.twitter.com/jSiCxJJXax
— IndiaGlitz Telugu™ (@igtelugu) December 25, 2022
(The above story first appeared on LatestLY on Dec 25, 2022 08:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

