JEE Advanced 2023 Results: జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు వచ్చేశాయోచ్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు దాదాపు... 1.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

JEE Advanced 2023 Results: జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు వచ్చేశాయోచ్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!
Representational Picture. Credits: PTI

Newdelhi, June 18: జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ (JEE Advanced) ఫలితాలు (Results) కాసేపటి క్రితం విడుదలయ్యాయి. ఐఐటీల్లో (IIT) బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు దాదాపు 1.80 లక్షల మంది విద్యార్థులు (Students) హాజరయ్యారు. ఇందులో తెలుగు రాష్ట్రాల (Telugu States) నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు.. తమ ఫలితాలను jeeadv.ac.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీని సైతం ఐఐటీ గువాహటి విడుదల చేసింది.  అడ్వాన్స్ డ్ పరీక్షలో కటాఫ్‌ మార్కులు నిర్ణయించి సుమారు 45 వేల మంది విద్యార్థులను జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్‌కు అర్హత కల్పిస్తారు. పాసైన వారు ఈ నెల 19 నుంచి మొదలయ్యే జోసా కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

Delhi Shocker: చెల్లింపుల కోసం మొబైల్‌లో యాప్ డౌన్‌లోడ్ చేయమని భార్యకు చెప్పిన భర్త.. డౌన్‌లోడింగ్‌లో ఆలస్యం జరుగుతుండటంతో భార్యతో గొడవ.. మధ్యలో కల్పించుకున్న కుమారుడిపై కత్తితో దాడి.. ఢిల్లీలో వెలుగు చూసిన ఘటన

రిజల్ట్స్ ఇలా చెక్​ చేసుకోండి..

  • స్టెప్​ 1: అధికారిక వెబ్​సైట్​లో https://jeeadv.ac.in/ కి వెళ్లండి.
  • స్టెప్​ 2: హోం పేజ్​లో కనిపించే జేఈఈ అడ్వాన్స్​డ్​ 2023 రిజల్ట్​ లింక్​పై క్లిక్​ చేయాలి.
  • స్టెప్​ 3: లాగిన్​ వివరాలు ఎంటర్ చేయాలి.
  • స్టెప్​ 4: ఫలితాలు స్క్రీన్​పై డిస్​ప్లే అవుతాయి.

RBI Lost Money: ప్రింట్‌ అయినా ఆర్బీఐకి చేరని 88 వేల కోట్ల విలువైన రూ.500 నోట్లు.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే?

(The above story first appeared on LatestLY on Jun 18, 2023 10:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).