Representative Image (File Image)

Newdelhi, June 18: దేశరాజధాని ఢిల్లీలో (Delhi) దారుణం జరిగింది. మొబైల్‌లో (Mobile) యాప్ (App) డౌన్‌లోడ్ (Download) అవడంలో జాప్యం జరుగుతుండటంతో భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి, అడ్డొచ్చిన కొడుకును కత్తితో పొడిచాడు. అసలు ఏం జరిగిందంటే.. అశోక్ సింగ్(64) ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో సీనియర్ మేనేజర్‌గా చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన కుమారుడు ఆదిత్య(23) కంప్యూటర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అశోక్ ఇటీవలే గురుగ్రామ్‌లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఈ క్రమంలో చెల్లింపుల కోసం మొబైల్‌లో యాప్ డౌన్‌లోడ్ చేయాలని భార్యకు చెప్పారు.

RBI Lost Money: ప్రింట్‌ అయినా ఆర్బీఐకి చేరని 88 వేల కోట్ల విలువైన రూ.500 నోట్లు.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే?

ఆసుపత్రిలో కొడుకు

కానీ డౌన్‌లోడింగ్‌లో జాప్యం జరుగుతుండటంతో అసహనానికి లోనైన ఆయన భార్యతో గొడవకు దిగారు. ఈ క్రమంలో తనకు అడ్డుపడ్డ కొడుకును కత్తితో పొడిచేశారు. ఫలితంగా, ఆదిత్యను ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. గాయాలకు చికిత్స చేసిన అనంతరం వైద్యులు అతడిని డిశ్చార్జ్ చేశారు.

Comedian Sudhakar: కమెడియన్ సుధాకర్ ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా? గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయారో మీరూ చూడండి!