Newdelhi, June 18: దేశ ఆర్థిక వ్యవస్థను, నగదును నియంత్రించే రిజర్వు బ్యాంకే (RBI) నోట్లను పోగొట్టుకున్నది. ఒకటి రెండు నోట్లు (Notes), నోట్ల కట్టలు కాదు.. నోట్ల గుట్టలనే పోగొట్టుకున్నది. వీటి విలువ అక్షరాలా రూ.88,032 కోట్లు. యావత్తు దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ వ్యవహారం ఆరేండ్లుగా బయటపెట్టలేదు. ఆర్టీఐ (RTI) కార్యకర్త మనోరంజన్ రాయ్ చేసిన దరఖాస్తుతో తాజాగా బయటకు వచ్చింది. నాసిక్‌లోని మింట్ కాంపౌండ్‌లలో ప్రింట్ అయిన నోట్లు ఆర్బీఐకి చేరలేదనే విషయం బయటపడింది. ఈ వ్యవహారం ఇప్పుడు బయటకు వచ్చినా జరిగి దాదాపు ఆరేండ్లు గడుస్తున్నది. ఈ వ్యవహారంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముద్రణాలయాలు, ఆర్బీఐ వద్ద రికార్డుల్లో నోట్ల ముద్రణకు సంబంధించి లెక్కలు తేడా వస్తే ఇంతకాలంగా ఎందుకు బయటపెట్టలేదు ? అసలు ఈ నోట్లు ఎక్కడకు వెళ్లాయి ? పెద్దనోట్ల రద్దు సమయంలోని గందరగోళ పరిస్థితులే ఈ నోట్ల మాయానికి కారణమా ? ఈ నోట్లు ఎవరి చేతుల్లోకి చేరాయి ? అనధికారికంగా విపణిలోకి వచ్చేశాయా ? వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
#RTI query reveals #rs500 #Currency notes worth Rs 88,032 crore failed to reach from mints to @RBI: Reporthttps://t.co/F95GDWhIAs#RBI
— Zee Business (@ZeeBusiness) June 17, 2023
Clarification on Banknote pic.twitter.com/PsATVk1hxw
— ReserveBankOfIndia (@RBI) June 17, 2023
ఆర్బీఐ ఏం చెప్పిందంటే?
నోట్ల గల్లంతుపై మీడియాలో వస్తున్న వార్తలు తప్పని ఆర్బీఐ వివరణ ఇచ్చింది. ఆర్టీఐ పిటిషన్ ద్వారా అడిగిన ప్రశ్నకు ప్రింటింగ్ ప్రెస్ యంత్రాంగం ఇచ్చిన సమాచారంలో కొంత అస్పష్టత ఉన్నట్టు తెలిపింది.
JEE Advanced 2023 Results: నేడు జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!