Newdelhi, June 18: జేఈఈ అడ్వాన్స్ డ్ (JEE Advanced) ఫలితాలు (Results) నేడు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఐఐటీల్లో (IIT) బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు దాదాపు 1.80 లక్షల మంది విద్యార్థులు (Students) హాజరయ్యారు. ఇందులో తెలుగు రాష్ట్రాల (Telugu States) నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు.. తమ ఫలితాలను jeeadv.ac.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్స్తో పాటు ఫైనల్ ఆన్సర్ కీని సైతం ఐఐటీ గువాహటి విడుదల చేయనుంది. అడ్వాన్స్ డ్ పరీక్షలో కటాఫ్ మార్కులు నిర్ణయించి సుమారు 45 వేల మంది విద్యార్థులను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్‌కు అర్హత కల్పిస్తారు. పాసైన వారు ఈ నెల 19 నుంచి మొదలయ్యే జోసా కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
- స్టెప్ 1: అధికారిక వెబ్సైట్లో https://jeeadv.ac.in/ కి వెళ్లండి.
- స్టెప్ 2: హోం పేజ్‌లో కనిపించే జేఈఈ అడ్వాన్స్డ్ 2023 రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: లాగిన్ వివరాలు ఎంటర్ చేయాలి.
- స్టెప్ 4: ఫలితాలు స్క్రీన్‌పై డిస్ప్లే అవుతాయి.