Ranchi, June 18: బాలీవుడ్ నటి అమీషా పటేల్ (Ameesha Patel) ఓ చెక్ బౌన్స్ (Cheque Bounce) కేసులో ఝార్ఖండ్ (Jharkhand) లోని రాంచీ కోర్టులో (Ranchi Court) లొంగిపోయారు. సినిమా ప్రొడక్షన్ పేరిట అమీషా పటేల్ తన నుంచి రెండున్నర కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని, డబ్బు ఎగ్గొట్టారని నిర్మాత, వ్యాపారవేత్త అజయ్ కుమార్ రాంచీ కోర్టును ఆశ్రయించారు. అమీషా పటేల్ సినిమా పూర్తి చేయకపోగా, తన డబ్బు తిరిగి ఇవ్వలేదని, అసలు రూ.2.5 కోట్లకు వడ్డీ రూ.50 లక్షలు అయిందని, మొత్తం రూ.3 కోట్లు చెల్లించేలా అమీషా పటేల్ ను ఆదేశించాలని అజయ్ కుమార్ కోర్టును కోరారు.
Actress Ameesha Patel surrenders before Ranchi court in cheque bounce case#AmeeshaPatel #Ranchi #India #IndiaNews #News #ChequeBounceCasehttps://t.co/HjNlQfQupH
— Mid Day (@mid_day) June 17, 2023
ముసుగు కప్పుకుని కారెక్కి..
నిర్మాత పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న రాంచీ కోర్టు ఈ ఏప్రిల్ 6న అమీషా పటేల్ పై వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో నిన్న రాంచీ వచ్చిన అమీషా పటేల్ న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. అనంతరం ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. కాగా, కోర్టు వెలుపల మీడియా హడావిడి చూసిన అమీషా తలపై ముసుగు కప్పుకుని కారెక్కి వెళ్లిపోయారు.