Ravinder Gupta Arrested (PIC@ Twitter)

Hyderabad, June 18: నిజామబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) వైస్‌ చాన్స్‌లర్‌ దాచేపల్లి రవీందర్‌ గుప్తా (VC Ravinder Gupta)ను ఏసీబీ అధికారులు శ‌నివారం సాయంత్రం అరెస్టు చేశారు. తార్నాక‌లోని ఆయ‌న నివాసంలో దాదాపు 8 గంట‌ల పాటు సోదాలు నిర్వ‌హించిన అనంత‌రం ర‌వీంద‌ర్ గుప్తాను అరెస్టు చేస్తున్న‌ట్లు ఏసీబీ అధికారులు ప్ర‌క‌టించారు. ర‌వీంద‌ర్ గుప్తాను ఏసీబీ అధికారులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నిజామాబాద్ జిల్లా ప‌రిధిలోని భీమ్‌గ‌ల్‌లో ప‌రీక్షా కేంద్రం (Exam Centre) ఏర్పాటుకు రూ.50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు వీసీ ర‌వీంద‌ర్ గుప్తా రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. హైదరాబాద్‌లోని తార్నాకలో (Tarnaka) ఉన్న తన నివాసంలో లంచం (Bribe) తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని భీమ్‌గల్‌లో (Bheemgal) పరీక్షా కేంద్రం ఏర్పాటుకు రవీందర్‌ గుప్తా లంచండ డిమాండ్‌ చేశారు. దీంతో ఆయన అడిగిన మొత్తాన్ని నిర్వహాకులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Prof Haragopal: ప్రొఫెసర్ హరగోపాల్ మీద పెట్టిన UAPA కేసును వెంటనే ఎత్తివేయాలని డీజీపీని ఆదేశించిన సీఎం కేసీఆర్ 

గతకొన్ని రోజులుగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. వర్సిటీ రిజిస్ట్రార్‌ నియామకం విషయంలో పాలకమండలితో వీసీకి తలపడిన విషయం తెలిసిందే. అయితే వర్సిటీలో పరిస్థితులు రోజురోజుకూ ప్రతికూలంగా మారుతుండటంతో వీసీ వెనక్కి తగ్గారు. రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ యాదగిరిని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. అయితే తాజాగా వీసీ రవీందర్‌ గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకీ పట్టుబడటం గమనార్హం. వీసీ ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డిన త‌ర్వాత విద్యార్థులు తెలంగాణ యూనివ‌ర్సిటీలో సంబురాలు నిర్వ‌హించారు.