Representational (Credits: Facebook)

Puri, June 18: దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తున్న పూరీ జగన్నాథ (Puri Jagannadh) రథయాత్రకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో పూరీకి (Puri) వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త (Goodnews) చెప్పింది. ఇక్కడికి ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతోంది. జూన్ 18వ తేదీ నుంచి 22 మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాందేడ్ నుండి ఈ రైళ్లు ప్రారంభమవుతాయి. టిక్కెట్ రిజర్వేషన్ సదుపాయం ఇప్పటికే ప్రారంభమైందని, ఏసీ, నాన్ ఏసీ సదుపాయం కల్పించినట్లు అధికారులు తెలిపారు. అన్-రిజర్వ్డ్ ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది.

Ravinder Gupta Arrested: తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ అరెస్ట్, రూ.50వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయిన రవీందర్ గుప్తా, యూనివర్సిటీలో సంబురాలు

ఎక్కడి నుంచి ఎక్కడికంటే?

ఈ నెల 18న సికింద్రాబాద్ నుండి మలాటిపట్పూర్, 19న మలాటిపట్పూర్ నుండి సికింద్రాబాద్ కు, ఈ నెల 19న నాందేడ్ నుండి ఖుర్దా రోడ్, 20న ఖుర్దా రోడ్ నుండి నాందెడ్ కు, ఈ నెల 21న కాచిగూడ నుండి మలాటిపట్పూర్, 21న మలాటిపట్పూర్ నుండి కాచిగూడకు రైళ్లు నడుపుతున్నారు.

Prof Haragopal: ప్రొఫెసర్ హరగోపాల్ మీద పెట్టిన UAPA కేసును వెంటనే ఎత్తివేయాలని డీజీపీని ఆదేశించిన సీఎం కేసీఆర్