TSPSC Group-2 Exams: తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. జనవరి 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయం.. ఏర్పాట్లు చేయాలంటూ జిల్లా కలెక్టర్లకు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ లేఖ

తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్‌న్యూస్. పరీక్ష షెడ్యూల్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారికి టీఎస్‌పీఎస్సీ ఊరట కలిగించే వార్త చెప్పింది.

TSPSC Group-2 Exams: తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. జనవరి 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయం.. ఏర్పాట్లు చేయాలంటూ జిల్లా కలెక్టర్లకు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ లేఖ
TSPSC (Photo-Wikimedia Commons)

Hyderabad, Dec 5: తెలంగాణ (Telangana) గ్రూప్-2 అభ్యర్థులకు (Group-2) గుడ్‌న్యూస్. పరీక్ష షెడ్యూల్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారికి టీఎస్‌పీఎస్సీ (TSPSC) ఊరట కలిగించే వార్త చెప్పింది. జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలంటూ సోమవారం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు  టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనిత రామచంద్రన్ లేఖ రాశారు. పరీక్ష నిర్వహణకు సన్నద్ధమవ్వాలని, తగిన ఏర్పాట్లు చేయాలని అందులో పేర్కొన్నారు.

Cyclone Michaung Alert: కాసేపట్లో నెల్లూరు తీరాన్ని మైచాంగ్ తుఫాన్ దాటేందుకు సిద్ధం, అప్రమత్తమైన తీరప్రాంతాలు.. తిరుపతి నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

పేపర్ లీకేజీతో..

కాగా గ్రూప్-2 పరీక్ష ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. పేపర్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ డిమాండ్లు తెరపైకి వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకునేలోపే ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో టీఎస్‌పీఎస్సీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి.

Mizoram Assembly Election Results 2023: మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, 27 స్థానాలను కైవసం చేసుకున్న జేపీఎం, సీఎం కాబోతున్న ఇందిరాగాంధీ భద్రతాధికారి లల్దుహోమా

(The above story first appeared on LatestLY on Dec 05, 2023 08:08 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).