ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ‘జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (JPM)’ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 40 స్థానాల్లో జేపీఎం ఏకంగా 27 స్థానాలను కైవసం చేసుకుంది.జేపీఎం అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి లల్దుహోమా ఇంటి ముందు కార్యకర్తలతో పండగ వాతావరణం నెలకొంది. లల్దుహోమా గతంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి భద్రతాధికారిగా పనిచేశారు.
అధికార ‘మిజో నేషనల్ ఫ్రంట్ (MNF)’ రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీకి 10 స్థానాలు దక్కాయి. మిగిలిన మూడు స్థానాల్లో బీజేపీకి 2, కాంగ్రెస్‌కు 1 దక్కాయి. నవంబర్ 7న మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా అక్కడ 80.66 శాతం పోలింగ్ నమోదైంది.నాలుగు పార్టీల మధ్య జరిగిన చతుర్ముఖ పోరులో మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో దిగారు. దాదాపు 4 వేల మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. మిజోరాం ఎన్నికల ఫలితాలు, అధికార పార్టీ ఎంఎన్‌ఎఫ్‌కు బిగ్ షాక్, అధికార ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించిన జడ్‌పీఎం, ఓడిపోయిన సీఎం జోరమతంగ
Here's ANI Tweet
#MizoramResults | Zoram People’s Movement - ZPM is set to form its government in Mizoram as it wins 27 seats, as per the Election Commission of India.
Mizo National Front - MNF gets 10 seats out of 40 seats. pic.twitter.com/pRVnDcKh5M
— ANI (@ANI) December 4, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)