Kerala: పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతను చితకబాదుతున్న పోలీసులు, షాకింగ్ వీడియోని షేర్ చేసిన శశి థరూర్, ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఈ రోజు (సెప్టెంబర్ 4) సోషల్ మీడియాలో ఒక CCTV వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో కేరళలోని కున్నంకుళం పోలీస్ స్టేషన్లో యువజన కాంగ్రెస్ నేత వి.ఎస్. సుజిత్పై పోలీసులు కస్టడీలో దాడి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి

Kerala: పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతను చితకబాదుతున్న పోలీసులు, షాకింగ్ వీడియోని షేర్ చేసిన శశి థరూర్, ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..
CCTV video shows cops assaulting Youth Congress leader VS Sujith in police station in Kerala (Photo Credits: X/@ShashiTharoor)

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఈ రోజు (సెప్టెంబర్ 4) సోషల్ మీడియాలో ఒక CCTV వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో కేరళలోని కున్నంకుళం పోలీస్ స్టేషన్లో యువజన కాంగ్రెస్ నేత వి.ఎస్. సుజిత్పై పోలీసులు కస్టడీలో దాడి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. శశిథరూర్ ఈ వీడియోను తన X ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. పోలీసుల బెదిరింపులను ప్రశ్నించినందుకు పౌరుడిపై కస్టడీలో దాడి చేయడం కేవలం చట్టవిరుద్ధమే కాదు.. అది మానవత్వానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద తన్నుకున్న ఇంటర్ విద్యార్థులు, బస్సు‌పై రాళ్లు విసురుకుంటూ ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ..

అయితే ఈ వీడియో 2023లో జరిగిన ఘటనకు సంబంధించినది. ఇందులో పోలీసులు స్టేషన్ లోపల సుజిత్‌పై దాడి చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. శశిథరూర్ మాట్లాడుతూ.. న్యాయం, గౌరవ సూత్రాలను ఉల్లంఘించే అధికారులకు పోలీసు వ్యవస్థలో స్థానం ఉండకూడదని పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన శిక్షలు విధించాలంటూ థరూర్ డిమాండ్ చేశారు.

Cops Assault Youth Congress Leader VS Sujith in Police Station:

Shashi Tharoor Shares Video Showing Police Brutality on VS Sujith

Shashi Tharoor Shares Video Showing Police Brutality on VS Sujith

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 04, 2025 07:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).