మరికొద్ది గంటల్లో నెల్లూరు తీరాన్ని మైచాంగ్ తుఫాన్ దాటేందుకు సిద్ధంగా ఉంది. దీని వలన తిరుపతి నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల వలన మరో ఐదు గంటల్లో తిరుపతి నగరంతో పాటుగా శ్రీకాళహస్తి, గూడూరు, నాయుడుపేట వైపుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు ముంచెత్తనుంది. దీని వలన వరద పెరిగే అవకాశాలు న్నాయి. అంతేకాదు విజయవాడ నగరంతో పాటుగా ఎన్.టీ.ఆర్. జిల్లాలోని వివిధ భాగాలు, గుంటూరు జిల్లాలో అక్కడక్కడ, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని కోస్తా భాగాల్లో తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. భారీ వర్షం అర్ధరాత్రికి మరింత ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
తుఫాన్ ప్రభావం మొత్తం కోస్తాంధ్ర లోకి విస్తరించి ఉంది. కింద తిరుపతి జిల్లా నుంచి పైన ఉన్న శ్రీకాకుళం జిల్లా వరకు తుఫాన్ ప్రభావం విస్తారంగా ఉంది, అలాగే వర్షాలు కూడ విస్తారంగా పడుతున్నాయి. నేడు రాత్రి ఈ వర్షాలు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా పడనుంది. అలాగే రేపటీకి ప్రకాశం, బాపట్ల, గుంటూరు, ఎన్.టీ.ఆర్. జిల్లాల్లో విస్తారంగా వర్షాలు, గాలులు పెరగనుంది. విశాఖలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రం కొనసాగుతునే ఉంటుంది.