Andhra Pradesh Global Investors Summit 2023 (Photo-Video Grab)

Visakha, Mar 4: ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ కోసం.. పరిపాలన రాజధాని విశాఖ వేదికగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 విజయవంతమైంది. సదస్సులో రెండో రోజైన శనివారం(మార్చి 4వ తేదీ) ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు(ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి పలు ప్రతిష్టాత్మక కంపెనీలు.

దాదాపు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. వీటిలో.. రిలయన్స్‌ కంపెనీ 50వేల కోట్ల రూపాయలతో అగ్రగామిగా ఉంది.రెండు రోజుల్లో 352 ఎంవోయూలు, మొత్తం రూ. 13 లక్షల 5వేల 663 కోట్ల పెట్టుబడులతో రూ. 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.

విశాఖ వేదికగా ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023లో రెండో రోజు పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో​ ఏపీలో పెట్టబోయే పెట్టుబడులను ప్రకటిస్తున్నారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విజయానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలని సీఎం జగన్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. సదస్సులో భాగంగా.. రెండో రోజైన శనివారం విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో పలు నూతన పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించి అనంతరం ఆయన ప్రసంగించారు.

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌‌లో తొలి రోజు ఒప్పందాలు ఇవే, పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూలు వివరాలు

గత మూడున్నరేళ్లలో ఆర్థికంగా రాష్ట్రం ముందడుగు వేస్తోంది. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. కోవిడ్‌ కష్టాలను కూడా అధిగమించాం. కరోనా సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అండగా నిలిచాయి. ఇప్పుడు కీలక సమయంలో జీఐఎస్‌ నిర్వహించాం. పారదర్శక పాలనతో విజయాలు సాధిస్తున్నాం.

గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సు ద్వారా 15 సెక్టార్లలో సెషన్స్‌ నిర్వహించాం. ఏపీ అభివృద్ధికి ఈ 15 సెక్టార్లు అత్యంత కీలకం. ఈ 15 కీలక రంగాల్లో ఫలవంతమైన చర్చలు జరిగాయి. రెండు రోజుల్లో 352 ఎంవోయూలు జరిగాయి. వందకు పైగా స్పీకర్లు పాల్గొన్నారు. యూఏఈ, వియత్నాం, నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియా దేశాలతో ప్రత్యేక కంట్రీ సెషన్స్‌ నిర్వహించాం.

విశాఖ నుంచే పరిపాలన, సమ్మిట్‌లో మరోసారి స్పష్టం చేసిన సీఎం జగన్, 6 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

జీఐఎస్‌ ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ. 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. దాదాపు 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి అవకాశాలు దక్కినట్లయ్యింది. మొత్తం పెట్టుబడుల్లో 8 లక్షల 84 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కేవలం ఎనర్జీ రంగంలో వచ్చాయి. గ్రీన్‌ ఎనర్జీతో భారత దేశ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ ప్రయాణం కీలకం. పర్యాటక రంగంలో 22 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి.

మీ అందరి పెట్టుబడులతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. చిత్తశుద్ధితో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ సమ్మిట్‌ ద్వారా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా మారింది అని సదస్సు ముగింపు ప్రసంగంలో ఏపీ సీఎం జగన్‌ పేర్కొన్నారు.

సమ్మిట్ లో  ఎవరెవరు ఏమన్నారంటే..

రెడ్డిస్‌ ల్యాబ్‌ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి

ఏపీ పెట్టుబడుల కేంద్రంగా మారింది. అంతర్జాతీయంగా ఫార్మా ఇండస్ట్రీ కీలక పాత్ర పోషిస్తోంది. ఏపీ ప్రభుత్వ సహకారం మరిచిపోలేనిది. ఏపీలో పరిశ్రమలకు అపార అవకాశాలున్నాయి. ఏపీలో పారిశ్రామిక విధానాల కారణంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. పరిశ్రమలకు అనుమతులు వెంటనే లభిస్తున్నాయి. ఇన్నోవేషన్‌లో ఏపీ ఆదర్శనీయంగా ఉంది. ఏపీలో సామాజిక సూచికలు విశిష్టంగా ఉన్నాయి. ఆరోగ్య రంగ ప్రగతి కోసం వైఎస్సార్‌ చేసిన కృషి అమోఘం అని అన్నారు.

అవాడ గ్రూప్‌ ఛైర్మన్‌ వినిత్‌ మిట్టల్‌

ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. దేశ ఆర్థిక ప్రగతిలో ఏపీ కీలకంగా ఉంది. పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ కీలక పాత్ర పోషించబోతోంది. ఏపీ గ్రీన్‌ ఎనర్జీ అప్రోచ్‌ అమోఘం. కర్బన రహిత పర్యావరణం కోసం ఏపీ కృషి చేస్తోందన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నెంబర్‌ వన్‌గా నిలిచింది. నెంబర్‌ వన్‌గా నిలవడం సాధారణమైన విషయం కాదు. పారిశ్రామిక అనుకూల వాతావరణంవలనే ఏపీలో మా పెట్టుబడ్డులు పెట్టాం అని తెలిపారు.

సెయింట్‌ గొబెయిన్‌ సీఈవో సంతానం

ఏపీ ప్రభుత్వ సమర్థతలో అసాధారణ రీతిలో పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలు కోరుకునే సుస్థిరమైన విధానాలు ఏపీలో ఉన్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టినందుకు సంతోషంగా ఉంది. ఏపీలో మా పెట్టుబడులు విస్తారిస్తాం. ఏపీ ప్రభుత్వం నిబద్దతలో పనిచేస్తోంది. నాణ్యమైన మానవ వనరులు ఏపీలో తయారవుతున్నాయి. ఉన్నతాధికారులు సహకారం చక్కగా ఉంది. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నారు. ఏపీలో హామీలు నెరవేరుస్తున్న చేతల ప్రభుత్వం ఉంది.

లారస్‌ ల్యాబ్స్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈవో సత్యనారాయణ చావా

ఫార్మా రంగంలో​ ఏపీ పటిష్టంగా ఉంది. ఏపీలో ఎకో సిస్టమ్‌ బాగా ఉండటం వల్ల కంపెనీలు బలపడుతున్నాయి. ప్రపంచానికి కావాల్సిన కీలక డ్రగ్స్‌ ఏపీలో తయారవుతున్నాయి. ప్రసిద్ధి చెందిన ఫార్మా కంపెనీలన్నీ ఏపీలో పనిచేస్తున్నాయి. పారిశ్రామిక ప్రగతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ప్రభుత్వానికి నా అభినందనలు. ఏపీలో ఇతర రాష్ట్రాల కంటే వేగంగా అనుమతులు లభిస్తున్నా​యి.

నోవా ఎయిర్‌ సీఈఓ అండ్‌ ఎండీ గజానన్‌ నాజర్‌

ఆర్థిక వ్యవస్థలో ఏపీ నంబర్‌ వన్‌. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీకి సమర్ధవంతమైన నాయకత్వం ఉంది. రాష్ట్రంలో ప్రతిభగల అధికారులు ఉన్నారు. రెండు రోజుల గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు జోష్‌గా సాగింది. ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు సమ్యలను పరిష్కరిస్తున్నారు అని తెలిపారు.

అపాచీ అండ్‌ హిల్‌టాప్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ సెర్జియో లీ

పారిశ్రామిక ప్రగతి కోసం వైఎస్సార్‌ చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. మూడు దేశాల్లో అపాచీ గ్రూప్‌ కార్యాకలాపాలున్నాయి. సీఎం జగన్‌ విజనరీ లీడర్‌. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీలో​ డైనమిక్‌ సీఎం ఉండటంతోనే పారిశ్రామిక ప్రగతి సాధ్యమైందన్నారు.

భారత్‌ బయోటెక్‌ ఎండీ సుచిత్ర కె ఎల్లా

ఏపీ అభివృద్ధిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతిష్టాత్మకంగా భావించి జీవిఎస్‌ నిర్వహించారు.పలు కీలక రంగాల్లో ఏపీ ప్రగతి బాగుంది. సీఐఐకి దివంగత సీఎం వైఎస్సార్‌ సహకారం మరువలేనిది. ఏపీ పారిశ్రామిక ప్రగతికి సీఐఐ సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అంతర్జాతీయ కంపెనీలు ఏపీ వైపు చూడటం ప్రశంసనీయం. ఇండియా ప్రగతిలో ఏపీ కీలక భాగస్వామి అవుతోంది. సమ్మిళిత వృద్ధి కోసం సీఎం జగన్‌ కృషి చేస్తున్నారు’ అని ప్రశంసించారు.

హెటిరో గ్రూప్‌ ఎండీ డాక్టర్‌ వంశీ కృష్ణ బండి

ప్రపంచ ఫార్మా రంగంలో ఏపీ కీలక ప్రాత​ పోషిస్తోంది. ఏపీలో ఫార్మా విధానాలతో ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతోంది. పరిశ్రమలకు ఏపీ సర్కార్‌ సహకారం అమోఘం అని అన్నారు.

మంత్రి గుడివాడ అమర్నాథ్‌

సీఎం వైఎస్ జగన్‌ మాటల మనిషి కాదు.. చేతల మనిషి. సీఎం జగన్‌ దార్శనికతతో పారిశ్రామికంగా మందడుగు వేస్తున్నాం. జీఐఎస్‌ చారిత్రాత్మక విజయం సాధించింది. వివిధ దేశాల నుంచి ప్రసిద్ధ సంస్థలు జీఐఎస్‌కు వచ్చాయి. రెండు రోజల సదస్సులో​ విలువైన చర్చలు జరిగాయి. పారిశ్రామికవేత్తల అంచనాలకు తగినట్టు ప్రభుత్వం సహకారం అందిస్తోంది.

సీఎస్‌ జవహర్‌ రెడ్డి

జీఐఎస్‌ అంచనాలకు మించి విజయం సాధించింది. పారిశ్రామిక దిగ్గజాలు తమ విలువైన అభిప్రాయాలు పంచుకున్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. జీఐఎస్‌ సూపర్‌ సక్సెస్‌ సాధించింది.

కేంద్ర మంత్రిసర్బానంద సోనోవాల్‌

జీఐఎస్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. దేశంలో విశాఖపట్నం ప్రత్యేక నగరంగా నిలిచింది. శతాబ్ధాలుగా భారతదేశంలో విశాఖ కీలకంగా ఉంది. విశాఖ కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషం. ఏపీ వేగంగా అభివృద్ధి చెందడానికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. విశాఖ పోర్టు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. విశాఖపట్నం చాలా అందమైన ప్రదేశం. విశాఖలాంటి నగరం ఉండటం ఏపీ అదృష్టం. భారత దేశ ప్రగతిలో ఏపీ కీలకం కానుంది’ అని కామెంట్స్‌ చేశారు.

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

విశాఖ రాజధాని అంటూ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అభివృధ్ది చెందిన విశాఖలో.. జిల్లా కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్సీగా మాధవ్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. అయితే, పార్టీ కోసం కిషన్‌ రెడ్డి పైవ్యాఖ్యలు చేసినప్పటికీ.. రాజధానిగా విశాఖను ధృవీకరిస్తూ చేసిన కామెంట్స్‌ ప్రముఖంగా నిలిచాయి.

జీఐఎస్‌లో పాల్గొనడం సంతోషకరంగా ఉంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏపీ సొంతం. ప్రతిభగల యువత ఏపీలో ఉన్నారు. ప్రపంచ ఆర్థికప్రగతిలో ఇండియా కీలకమని ఐఎంఎఫ్‌ ప్రకటించింది. దేశంలో అంతర్జాతీయ రహదారులు నిర్మిస్తున్నాం. పలు కీలక రంగాల్లో కనెక్టివిటీ బాగా పెరిగింది. నూతన భారత్‌ నిర్మాణం వేగంగా జరుగుతోంది. 2025 నాటికి ఇండియాలో 250 యూనికార్న్‌ సంస్థలు ఉంటాయి.

రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోంది. ఏపీకి పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సమాఖ్య స్పూర్తితో ఏపీకి అన్ని విధాలా సహకారం అందిస్తాం. ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. రికార్డు స్థాయిలో​ ఏపీలో ఎంవోయూలు జరిగాయి. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలకు అభినందనలు. ఏపీ ప్రగతికి చిత్తశుద్ధితో కృషిచేస్తోన్న సీఎం జగన్‌కు అభినందనలు అంటూ ప్రశంసలు కురిపించారు.

విశాఖ జీఐఎస్‌లో రెండోరోజు ఎంవోయూల జాబితా

►రిలయన్స్‌ ఎంవోయూ రూ. 50,000 కోట్లు

►హెచ్‌పీసీఎల్‌ ఎనర్జీ ఎంవోయూరూ. 14, 320 కోట్లు

►టీవీఎస్‌ ఐఎల్‌పీ ఎంవోయూ రూ. 1,500 కోట్లు

►ఎకో స్టీల్‌ ఎంవోయూ రూ. 894 కోట్లు

►బ్లూస్టార్‌ ఎంవోయూ రూ. 890 కోట్లు

►ఎస్‌2పీ సోలార్‌ సిస్టమ్స్‌ ఎంవోయూ రూ. 850 కోట్లు

►గ్రీన్‌లామ్‌ సౌత్‌ లిమిటెడ్‌ ఎంవోయూ రూ. 800 కోట్లు

►ఎక్స్‌ప్రెస్‌ వెల్‌ రీసోర్సెస్‌ ఎంవోయూ రూ. 800 కోట్లు

►రామ్‌కో ఎంవోయూ రూ. 750 కోట్లు

►క్రిబ్కో గ్రీన్‌ ఎంవోయూ రూ. 725 కోట్లు

►ప్రకాశ్‌ ఫెరోస్‌ ఎంవోయూ రూ. 723 కోట్లు

►ప్రతిష్ట బిజినెస్‌ ఎంవోయూ రూ. 700 కోట్లు

►తాజ్‌ గ్రూప్‌ ఎంవోయూ రూ. 700 కోట్లు

►కింబర్లీ క్లార్క్‌ ఎంవోయూ రూ. 700 కోట్లు

►అలియన్న్‌ టైర్‌ గ్రూప్‌ ఎంవోయూ రూ. 679 ‍కోట్లు

►దాల్మియా ఎంవోయూ రూ. 650 కోట్లు

►అనా వొలియో ఎంవోయూ రూ. 650 కోట్లు

►డీఎక్స్‌ఎన్‌ ఎంవోయూ రూ. 600 కోట్లు

►ఈ-ప్యాక్‌ డ్యూరబుల్‌ ఎంవోయూ రూ. 550 కోట్లు

►నాట్‌ సొల్యూషన్న్‌ ఎంవోయూ రూ. 500 కోట్లు

►అకౌంటిఫై ఇంక్‌ ఎంవోయూ రూ. 488 కోట్లు

►కాంటినెంటల్‌ ఫుడ్‌ అండ్‌ బెవరేజీస్‌ ఎంవోయూ రూ. 400 కోట్లు

►నార్త్‌ ఈస్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎంవోయూ రూ. 400 కోట్లు

►ఆటమ్‌స్టేట్‌ టెక్నాలజీస్‌ ఎంవోయూ రూ. 350 కోట్లు

►క్లేరియన్‌ సర్వీసెస్‌ ఎంవోయూ రూ. 350 కోట్లు

►చాంపియన్‌ లగ్జరీ రిసార్ట్స్‌ ఎంవోయూ రూ. 350 కోట్లు

►వీఆర్‌ఎమ్‌ గ్రూప్‌ ఎంవోయూ రూ. 342 కోట్లు

►రివర్‌ బే గ్రూప్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

►హావెల్స్‌ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు

►సూట్స్‌ కేర్‌ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు

►పోలో టవర్స్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

►ఇండియా అసిస్ట్‌ ఇన్‌సైట్స్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

►స్పార్క్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

►టెక్‌ విషెన్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

►మిస్టిక్‌ పామ్స్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

►నియోలింక్‌ గ్రూప్‌ ఎంవోయూ రూ. 300 కోట్లు

►ఎండానా ఎనర్జీస్‌ ఎంవోయూ రూ. 285 కోట్లు

►అబ్సింకా హోటల్స్‌ ఎంవోయూ రూ. 260 కోట్లు

►సర్‌ రే విలేజ్‌ రిసార్ట్స్‌ ఎంవోయూ రూ. 250 కోట్లు

►హ్యాపీ వండర్‌లాండ్‌ రిసార్ట్స్‌ ఎంవోయూరూ. 250 కోట్లు

►చాంపియన్స్‌ యాచ్‌ క్లబ్‌ ఎంవోయూ రూ. 250 కోట్లు

►టెక్నోజెన్‌ ఎంవోయూ రూ. 250 కోట్లు

►పార్లె ఆగ్రో ఎంవోయూ రూ. 250 కోట్లు

►ఎకో అజైల్‌ రిసార్ట్‌ ఎంవోయూ రూ. 243 కోట్లు

►ఎల్జీ పాలిమర్స్‌ ఎంవోయూ రూ. 240 కోట్లు

►హైథియన్‌ హ్యూయన్‌ మిషనరీ ఎంవోయూ రూ. 230 కోట్లు

►గోకుల్‌ ఆగ్రో ఎంవోయూ రూ. 230 కోట్లు

►ఎస్‌పీఎస్‌ ఇన్‌ప్రా ఎంవోయూ రూ. 225 కోట్లు

►డీవీవీ బయో ఫ్యూయల్స్‌ ఎంవోయూ రూ. 223 కోట్లు

►దాల్వకోట్‌ బయో ఫ్యూయల్ప్‌ ఎంవోయూ రూ. 200 కోట్లు

►ఆమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఎంవోయూ రూ. 200 కోట్లు

►కేపిటల్‌ బిజినెస్‌ పార్క్‌ ఎంవోయూ రూ. 184 కోట్లు

►చాంయిన్‌ యాచ్‌ ఎంవోయూ రూ. 190 కోట్లు

►ఎన్‌జీసీ ట్రాన్స్‌మిషన్‌ ఎంవోయూ రూ. 185 కోట్లు

►యాక్సలెంట్‌ ఫార్మా సైన్స్‌ ఎంవోయూ రూ. 176 కోట్లు

►విన్‌విన్‌ స్పెషాలిటీ ఇన్సులేటర్స్‌ ఎంవోయూ రూ. 174 కోట్లు

►ట్రాన్సెండ్‌ రియాలిటీ డెవలప్‌మెంట్‌ ఎంవోయూ రూ. 165 కోట్లు

►చాంపియన్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ఎంవోయూ రూ. 150 కోట్లు

►స్విచ్‌గేర్‌ ఎంవోయూ రూ. 150 కోట్లు

►ఆంబర్‌ ఎంటర్‌ప్రైజస్‌ ఇండియా ఎంవోయూ రూ. 150 కోట్లు

►ది రిప్పుల్స్‌ ఎంవోయూ రూ. 150 కోట్లుగా ఉన్నాయి.

ఇక విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ వేదికగా తొలి రోజు కూడా ఏపీ ప్రభుత్వంతో కీలక ఎంవోయూలు కుదిరాయి. మొత్తం 92 ఎంవోయూలు జరిగాయి. వీటి విలువ రూ.11లక్షల 87 వేల 756 కోట్లు. వీటిలో ఎన్టీపీసీ రూ. 2..35లక్షల కోట్ల ఎంవోయూతో అగ్రగామిగా నిలిచింది. ఏబీసీ లిమిటెట్‌ (రూ. 1.20 లక్షల కోట్లు), రెన్యూ పవర్‌ (రూ. 97, 550 కోట్లు), ఇండోసాల్‌ (రూ. 76, 033 కోట్లు), ఏసీఎమ్‌ఈ (రూ. 68,976 కోట్లు), టీఈపీఎస్‌ఓఎల్‌ ( రూ. 65, 000 కోట్లు), జేఎస్‌డబ్యూ గ్రూప్‌(రూ. 50, 632 కోట్లు), హంచ్‌ వెంచర్స్‌(రూ. 50 వేల కోట్లు), అవాదా గ్రూప్‌( రూ 50 వేల కోట్లు) జాబితాలో అగ్రగామిగా ఉన్నాయి.