YS Jagan Mohan Reddy (Photo-Video Grab)

Vizag, Mar 3: విశాఖలో​ జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరయ్యారు. ఏపీలో రూ.13 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు 340 ఇన్వెస్ట్ మెంట్ ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు.

తద్వారా 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు.త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాజధాని కాబోతోందని, విశాఖ నుంచి పరిపాలన సాగిస్తామని సీఎం జగన్ అన్నారు. ఏపీ కీలక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు మొదలయ్యాయని, రాష్ట్ర ఎగుమతులు గణనీయంగా పెరిగాయని తెలిపారు.

ఏపీలో జిందాల్ కంపెనీ రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, వేదికపైనే ప్రకటించిన నవీన్‌ జిందాల్‌, రూ.5వేల కోట్ల పెట్టుబడి పెడతామని తెలిపిన శ్రీ సిమెంట్

ఏపీలో 3 పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయని తెలిపిన సీఎం జగన్..పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలతో నంబర్‌వన్‌గా నిలిచామన్నారు. గ్రీన్‌ ఎనర్జీపై ప్రధాన ఫోకస్‌ చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి తెలిపారు. తొలిరోజే 92 ఎంవోయూలు.. మొత్తం రూ 13 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని ముందుకు వచ్చినట్లు సీఎం తెలిపారు. 20 రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నట్లు ఆయన వెల్లడించారు.

ఆరోగ్యశ్రీ పథకం ఆవిష్కర్త వైఎస్సార్‌, సమ్మిట్‌లో దివంగత సీఎం రాజన్నను గుర్తు చేసుకున్న అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డి

దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారిందని 340 సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయని సీఎం తెలిపారు. 340 ఏంవోయూలు.. 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏపీ భౌగోళికంగా పరిశ్రమలకు అనుకూలం. పెట్టుబడులకే కాదు ప్రకృతి అందాలకు కూడా విశాఖ నెలవు. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీ సొంతం. ఏపీలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పోర్టులకు సమీపంలో పుషల్కంగా భూములు ఉన్నాయి.  దేశంలో 11 పారిశ్రామిక కారిడార్స్‌ ఉంటే అందులో 3 ఏపీలోనే ఉన్నాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లు నంబర్‌ వన్‌గా ఉన్నాం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540 సేవలు అందిస్తున్నాము.