8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కీలక డిమాండ్.. ఉద్యోగుల కుటుంబాలకు మరింత బీమా రక్షణ కోరుతున్న ఉద్యోగ సంఘాలు..

8వ వేతన సంఘం (8th Pay Commission) సంప్రదింపులు కొనసాగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి సంఘాలు జీతభత్యాల పెంపుతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం (CGEGIS) లోనూ భారీ మార్పులు కోరుతున్నారు.

8th Pay Commission Latest News (Photo Credits: File Photo)

8th Pay Commission: 8వ వేతన సంఘం (8th Pay Commission) సంప్రదింపులు కొనసాగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి సంఘాలు జీతభత్యాల పెంపుతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం (CGEGIS) లోనూ భారీ మార్పులు కోరుతున్నారు. ద్రవ్యోల్బణం, మారుతున్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న బీమా రక్షణ ఏమాత్రం సరిపోవడంలేదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జీతాల సవరణకు ఉద్యోగ సంఘాల డిమాండ్..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రకాల ప్రయోజనాలు అందించడానికి 1982లో CGEGIS పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఉద్యోగి సర్వీసులో ఉండగా అకాల మరణం చెందితే కుటుంబానికి బీమా పరిహారం అందించడంతో పాటు, పదవీ విరమణ సమయంలో పొదుపు మొత్తాన్ని (Savings Component) ఒకేసారి చెల్లిస్తుంది. ఉద్యోగుల నెలవారీ జీతం నుండి దీనికి సంబంధించిన చందాను మినహాయించి బీమా, పొదుపు నిధులకు కేటాయిస్తారు.

36 ఏళ్లుగా మారని బీమా రేట్లు

CGEGIS బీమా కవరేజ్, నెలవారీ చందా రేట్లను చివరిసారిగా జనవరి 1990లో సవరించారు. CAG నివేదిక ప్రకారం ప్రస్తుతం ఉన్న కవరేజ్ వివరాలు:

గ్రూప్ 'ఎ' ఉద్యోగులు: రూ. 1.20 లక్షలు

గ్రూప్ 'బి' ఉద్యోగులు: రూ. 60,000

గ్రూప్ 'సి' ఉద్యోగులు: రూ. 30,000

గతంలో 7వ వేతన సంఘం కూడా ఈ బీమా కవరేజీని లెవెల్ ఆధారంగా రూ. 15 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు పెంచాలని సిఫార్సు చేసినప్పటికీ, అది అమలుకు నోచుకోలేదు.

ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు

ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్స్ (FNPO) వంటి వివిధ ప్రతినిధి సంఘాలు 8వ వేతన సంఘం ముందు పలు కీలక ప్రతిపాదనలు ఉంచాయి:

1. భారీ బీమా పెంపు: గ్రూప్ 'సి' ఉద్యోగులకు రూ. 1 కోటి, గ్రూప్ 'బి' కి రూ. 1.50 కోట్లు, గ్రూప్ 'ఎ' అధికారులకు రూ. 3 కోట్ల బీమా కవరేజీ కల్పించాలి.

2. స్వయంచాలక పెంపు (Auto-revision): కరువు భత్యం (DA) 50 శాతం దాటినప్పుడల్లా బీమా కవరేజీని స్వయంచాలకంగా 25 శాతం పెంచేలా నిబంధన తీసుకురావాలి.

3. నిష్పత్తి మార్పు: చందా కేటాయింపుల్లో బీమా రక్షణకు 70:30 నిష్పత్తిని అమలు చేయాలి.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించడంలో CGEGIS సవరణలు కీలక పాత్ర పోషిస్తాయని ఉద్యోగ సంఘాలు విశ్వసిస్తున్నాయి.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement