EPFO New Rule: రూ.15,000 నుంచి రూ.25,000కి వేజ్ సీలింగ్.. మీ టేక్-హోమ్ జీతంపై ఎంత ప్రభావం పడుతుందంటే..

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) కవరేజ్ కోసం తప్పనిసరి వేతన పరిమితిని (Wage Ceiling) నెలకు రూ. 15,000 నుండి రూ. 25,000 కు పెంచుతూ కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై వ్యక్తమవుతున్న సందేహాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

PF

EPFO New Rule: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) కవరేజ్ కోసం తప్పనిసరి వేతన పరిమితిని (Wage Ceiling) నెలకు రూ. 15,000 నుండి రూ. 25,000 కు పెంచుతూ కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై వ్యక్తమవుతున్న సందేహాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వేతన పరిమితి పెరిగినంత మాత్రాన ప్రతి ఉద్యోగి జీతం నుండి పీఎఫ్ కోత ఒకేసారి ఆటోమేటిక్‌గా రూ. 1,800 నుండి రూ. 3,000 కు పెరిగిపోదాని, ఇది పూర్తిగా సంబంధిత ఉద్యోగి జీతాల నిర్మాణం (Salary Structure) పై ఆధారపడి ఉంటుందని వెల్లడించింది.  ఈపీఎఫ్‌ఓ (EPFO) ఇ-నామినేషన్ పూర్తి చేయడానికి వివరణాత్మక గైడ్

'కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, 2020' (SS Code) నిబంధనల ప్రకారం మూల వేతనం (Basic Salary) మరియు కరువు భత్యం (DA) కలిపి "వేతనాలు"గా పరిగణిస్తారు. దీని ఆధారంగా పీఎఫ్ కోతల్లో కలిగే మార్పుల వివరాలు ఇలా ఉన్నాయి:

1. బేసిక్ జీతం రూ. 15,000 లేదా అంతకంటే తక్కువ ఉన్నవారికి:

ఈ విభాగంలో ఉన్న ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి మార్పు ఉండదు. గతంలో ఉన్నట్లే వారి మూల వేతనంపై 12 శాతం (గరిష్టంగా రూ. 1,800) పీఎఫ్ కోత కొనసాగుతుంది. చేతికి అందే జీతం (Take-Home Salary) మారదు.

2. బేసిక్ జీతం రూ. 15,000 నుండి రూ. 25,000 మధ్య ఉన్నవారికి:

ఈ కేటగిరీ ఉద్యోగుల పీఎఫ్ కోతలో మార్పు వస్తుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి మూల వేతనం + డిఏ కలిపి రూ. 22,000 ఉంటే, గతంలో సీలింగ్ ప్రకారం రూ. 1,800 మాత్రమే కట్ అయ్యేది. ఇప్పుడు కొత్త సీలింగ్ ప్రకారం రూ. 22,000 పై 12% అనగా రూ. 2,640 కోత పడుతుంది. దీనివల్ల ప్రతి నెలా అదనంగా రూ. 840 పీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది, అలాగే చేతికి అందే జీతం రూ. 840 తగ్గుతుంది.

3. బేసిక్ జీతం రూ. 25,000 కంటే ఎక్కువ ఉన్నవారికి:

వీరి పీఎఫ్ కోత గరిష్ట పరిమితి రూ. 25,000 పై 12 శాతం చొప్పున రూ. 3,000 వద్ద సీలింగ్ అవుతుంది. దీనివల్ల ఉద్యోగి వాటాతో పాటు యజమాని (Employer) చెల్లించాల్సిన చట్టబద్ధమైన వాటా కూడా రూ. 1,200 పెరుగుతుంది.

ఉద్యోగులపై భారం పడకుండా చట్టబద్ధ రక్షణ:

యజమాని చెల్లించాల్సిన అదనపు పీఎఫ్ వాటాను భరించడానికి ఉద్యోగి జీతంలో కోత విధించకూడదని, ఆ భారాన్ని ఉద్యోగులపైకి బదిలీ చేయకూడదని చట్టం స్పష్టం చేస్తోంది. చేతికి అందే జీతం కొద్దిగా తగ్గినప్పటికీ, ఆ మొత్తం వడ్డీతో సహా ఉద్యోగి పిఎఫ్ ఖాతాలోనే భద్రంగా ఉంటుందని, ఇది దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో పదవీ విరమణ నిధిగా (Retirement Corpus) మారడమే కాకుండా పెన్షన్ (EPS), బీమా (EDLI) ప్రయోజనాలను పెంచుతుందని అధికారులు వివరించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement