Trains Cancelled: హైదరాబాద్-సికింద్రాబాద్ పరిధిలో వారం పాటు 20 రైళ్లు రద్దు.. నిర్వహణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించిన రైల్వే శాఖ

హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో 20 రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేసినట్టు రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది. ఈ నెల 14 నుంచి 20 వరకూ 18 రైళ్లు, 15 నుంచి 21 తారీఖుల మధ్య మరో రెండు రైళ్లు రద్దు చేసినట్టు వివరించింది.

Trains Cancelled: హైదరాబాద్-సికింద్రాబాద్ పరిధిలో వారం పాటు 20 రైళ్లు రద్దు.. నిర్వహణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించిన రైల్వే శాఖ
Representational (Credits: Facebook)

Hyderabad, Aug 13: హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో 20 రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేసినట్టు రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది. ఈ నెల 14 నుంచి 20 వరకూ 18 రైళ్లు, 15  నుంచి 21 తారీఖుల మధ్య మరో రెండు రైళ్లు రద్దు చేసినట్టు వివరించింది. నిర్వహణ పనులు జరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. హైదరాబాద్‌ లో ఈ నెల 14 నుంచి 20 వరకూ 22 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది.

Shooting in USA: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. మినియాపొలిస్ నగరంలో శుక్రవారం రాత్రి ఓ మ్యూజిక్ షోలో కాల్పులు.. ఒకరి మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

రద్దైన ప్రధాన రైళ్ల వివరాలు..

  • కాజీపేట-డోర్నకల్-కాజీపేట
  • డోర్నకల్-విజయవాడ-డోర్నకల్
  • భద్రాచలంరోడ్-విజయవాడ-భద్రాచలంరోడ్
  • కాజీపేట-సిర్పుర్‌టౌన్
  • బళ్లార్ష-కాజీపేట
  • భద్రాచలంరోడ్-బళ్లార్ష
  • సిర్పుర్‌టౌన్-భద్రాచలంరోడ్
  • సికింద్రాబాద్-వరంగల్-సికింద్రాబాద్
  • సిర్పుర్‌టౌన్-సికింద్రాబాద్-సిర్పుర్‌టౌన్
  • కరీంనగర్-నిజామాబాద్-కరీంనగర్
  • కాజీపేట-బళ్లార్ష-కాజీపేట
  • కాచిగూడ-నిజామాబాద్-కాచిగూడ.

Telangana Rains: రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు.. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అవర్తనం.. దాని ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

(The above story first appeared on LatestLY on Aug 13, 2023 09:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).