Newyork, Aug 13: తుపాకీ కాల్పులతో (Shooting) అమెరికా (America) దద్దరిల్లిపోతున్నది. కాల్పుల కలకలంతో అగ్రరాజ్యం మరోసారి వణికిపోయింది. మిన్నెసొటా రాష్ట్రంలోని మినియాపొలిస్ (Minneapolis) నగరంలో శుక్రవారం రాత్రి ఓ పంక్ రాక్ షోలో (మ్యూజిక్ షో-Music Show) కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులకు తెగబడ్డట్టు తెలుస్తోంది. ఆ తరువాత వారు అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్లిపోయారని అధికారులు భావిస్తున్నారు. కాల్పుల్లో గాయపడ్డ వారు తమంతట తాముగా ఆసుపత్రికి వెళ్లారు.
USA: म्यूजिक कॉन्सर्ट के दौरान भीड़ पर अंधाधुंध गोलीबारी, एक की मौत, कई घायल; हमलावर फरार#US #USShooting #Minneapolis #MusicConcerthttps://t.co/hbxpTUC7Ms
— Amar Ujala (@AmarUjalaNews) August 13, 2023
కావాలనే టార్గెట్..
మ్యూజిక్ షోలో పాల్గొన్న వారిని నిందితులు కావాలనే టార్గెట్ చేసుకుని ఉంటారని పోలీస్ చీఫ్ బ్రయన్ ఓ హారా మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ఘటన మొదలయ్యే కంటే ముందువరకూ అంతా బానే ఉంది. కానీ ఆ మరుక్షణమే కాల్పులు జరిగాయి. తూటాల నుంచి తప్పించుకునేందుకు అందరూ నేలపై పడుకున్నారు’ అని ఆ మ్యూజిక్ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకుడు ఒకరు తెలిపారు. కాగా, నిందితుల కోసం పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.