Hyderabad, Aug 13: తెలంగాణలో (Telangana) వచ్చే మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు (Rains) కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన ఆవర్తనం కారణంగా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం ఈ ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది.
రానున్న మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ అలెర్ట్..!!#Rains #HydRains #WeatherUpdate #WeatherAlert #TelanganaRains #HyderabadRains #Oneindiatelugu
Watch Now: https://t.co/ivsrihvvnM
— oneindiatelugu (@oneindiatelugu) August 12, 2023
శనివారం దంచికొట్టిన వానలు
శనివారం తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు దంచికొట్టాయి. నల్గొండ జిల్లా ఘన్‌పూర్‌లో 71 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా నందనంలో 53 మిల్లీమీటర్లు, ఖమ్మం జిల్లా లింగాలలో 43, రావినూతల, తిమ్మారావుపేటలలో 42, రంగారెడ్డి జిల్లా బోడకొండలో 39 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.