భారత క్రిమినల్ చట్టాల్లో(Criminal Laws) మార్పులు కోరుతూ ఇవాళ పార్లమెంట్‌లో అమిత్ షా మూడు బిల్లును ప్రవేశపెట్టారు. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ సాక్ష్యా బిల్లు, భారతీయ నాగరిక సురక్షా సంహిత బిల్లులను ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు.ఈ మూడు బిల్లులను స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేశారు.ఆ మూడు చట్టాలను మార్చేసి, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో పెను మార్పులు తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.
కొత్త చట్టాలతో శిక్షను పెంచడం కాకుండా, న్యాయం దొరికేలా రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఏడేళ్లు లేదా అంత కన్నా ఎక్కువ కాలం శిక్షపడే కేసుల్లో.. ఆ క్రైమ్ సీన్‌కు కచ్చితంగా ఫోరెన్సిక్ బృందాలు విజిట్ చేయాలన్న నిబంధన తీసుకువస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశద్రోహం లాంటి చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం మైనర్‌ను రేప్ చేస్తే మరణశిక్ష విధించనున్నారు. ఇక గ్యాంగ్ రేప్‌కు పాల్పడితే 20 ఏళ్లు లేదా జీవితఖైదు శిక్ష విధించనున్నారు. సామూహిక దాడి కేసుల్లోనూ మరణశిక్ష విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Here's Amit Shah Tweet
#WATCH | Union Home Minister Amit Shah says, "...Under this law, we are repealing laws like Sedition...," as he speaks on Bharatiya Nyaya Sanhita Bill, 2023; The Bharatiya Sakshya Bill, 2023 and The Bharatiya Nagrik Suraksha Sanhita Bill in Lok Sabha. pic.twitter.com/CHlz0VOf7Z
— ANI (@ANI) August 11, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)