Dasara Special Trains: దసరాకు మరో 9 ప్రత్యేక రైళ్లు.. నేడు నాందేడ్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు, 24న హైదరాబాద్-కటక్, 25న కటక్-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు.. కాచిగూడ-రాయచూర్, రాయచూర్-కాకినాడ మధ్య 25 వరకు రైళ్ల రద్దు

దసరా (Dasara) సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) మరోమారు గుడ్‌ న్యూస్ (Good News) చెప్పింది.

Dasara Special Trains: దసరాకు మరో 9 ప్రత్యేక రైళ్లు.. నేడు నాందేడ్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు, 24న హైదరాబాద్-కటక్, 25న కటక్-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు.. కాచిగూడ-రాయచూర్, రాయచూర్-కాకినాడ మధ్య 25 వరకు రైళ్ల రద్దు
Representational (Credits: Facebook)

Hyderabad, Oct 20: దసరా (Dasara) సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) మరోమారు గుడ్‌ న్యూస్ (Good News) చెప్పింది. పండుగ కోసం ఇప్పటికే వేసిన ప్రత్యేక రైళ్లు (Dasara Special Trains) కూడా నిండిపోతుండడంతో మరో 9 రైళ్లను ప్రకటించింది. నేడు (20న)నాందేడ్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు ప్రకటించింది. ఈ రైలు (07061) నాండేడ్‌లో బయలుదేరి నిజామాబాద్, సికింద్రాబాద్, నల్గొండ మీదుగా కాకినాడకు చేరుకుంటుంది. 24న హైదరాబాద్-కటక్(07165) రైలును ప్రకటించింది. ఇది నల్గొండ, గుంటూరు, విజయవాడ, దువ్వాడ తదితర స్టేషన్ల మీదుగా నడుస్తుంది. 25న కటక్-హైదరాబాద్‌(07166) మధ్య మరో రైలు నడుస్తుందని, ఈ రైలు కూడా ఇదే మార్గంలో ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. మిగిలిన ప్రత్యేక రైళ్లు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించవని అధికారులు పేర్కొన్నారు.

WhatsApp New Update: త్వరలో ఒకే సిమ్‌ పై రెండు వాట్సాప్‌ ఖాతాలు.. ‘మెటా’ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ వెల్లడి

రైళ్ల రద్దు కూడా

నిర్వహణ పరమైన కారణాలతో కాచిగూడ-రాయచూర్ (17693), రాయచూర్-కాచిగూడ(17694) మధ్య రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 25 వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ రైళ్లు, మార్గాలు ఎంచుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

TS BJP First List: 65 మంది అభ్యర్థులతో నేడు బీజేపీ తొలి జాబితా??.. నేటి సాయంత్రం తొలి జాబితా ప్రకటన వెలువడవచ్చంటూ ఊహాగానాలు.. నిన్న జేపీ నడ్డా ఇంట్లో పలుమార్లు సమావేశమైన కోర్ కమిటీ

(The above story first appeared on LatestLY on Oct 20, 2023 10:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).