Hyderabad, Oct 20: ఒకే సిమ్ పై (One SIM) రెండు వాట్సాప్ ఖాతాల్లోకి (Whatsapp Account) లాగిన్ అయ్యే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తాజాగా ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఒక సిమ్ పై రెండు వాట్సాప్ ఖాతాల్ని కలిగి ఉండటానికి అవకాశం లేదు. రెండో సిమ్ లేదా రెండో ఫోన్ వాడాల్సిందే. ఒకే ఫోన్ లో ఒకే యాప్ లో రెండు వాట్సాప్ ఖాతాల్ని వాడుకునే సరికొత్త ఫీచర్‌ను తెస్తున్నామని, ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తుందని జుకర్ బర్గ్ తెలిపారు. వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి కొన్ని సెకన్లలలో రెండో అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చునని, రెండు ఖాతాలకు ప్రైవసీ, నోటిఫికేషన్ సెట్టింగ్స్ ఒకే విధంగా ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
WhatsApp will soon allow users to use two accounts on one phone https://t.co/8ZRoflHMRY via @timesofindia
— Dtf.in (@RksDtf) October 19, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)