Hyderabad, Oct 20: తెలంగాణలో (Telangana) అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) దగ్గరపడుతున్న వేళ బీజేపీ (BJP) కూడా దూకుడు పెంచింది. అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చిందని, నేడు 65 మందితో తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ ఎన్నికల ఇన్ చార్జ్ ప్రకాశ్ జవదేకర్ నివాసంలో నిన్న జరిగిన రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు పలుమార్లు చర్చించి జాబితాను సిద్ధం చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ లు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్ తోపాటు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ చీఫ్ నడ్డా నివాసంలో గతరాత్రి జరిగిన సమావేశానికి అమిత్ షా కూడా హాజరయ్యారు.
ఇవాళ బీజేపీ తొలి జాబితా? pic.twitter.com/NBTxZ9qQND
— Saffron Santhosh. (@Santhoshv4Bjp) October 20, 2023
మరో సమావేశం
ఈ ఉదయం 11 గంటలకు నడ్డాతో మరోమారు సమావేశమైన తర్వాత తుది జాబితాను సిద్ధం చేసి సాయంత్రం జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పంపిస్తారు. ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షా పాల్గొనే ఆ సమావేశంలో తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తారు.