Temperature in Telangana (Credits: Twitter)

Hyderabad, May 30: తెలంగాణలో (Telangana) భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలో నేడు, రేపు ఎండల తీవ్రత (High Temperatures) ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ (Weather Department) హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. రాజధాని హైదరాబాద్‌లో గరిష్ఠంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వొచ్చని తెలిపింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉంది.

GT vs CSK, IPL Final Match: నరాలు తెగే ఉత్కంఠతో కొనసాగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్, పోరాడి ఓడిన గుజరాత్ టైటాన్స్..

వడదెబ్బకు ఇద్దరు వృద్ధులు..

ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సూర్యాపేటలో వడదెబ్బకు ఇద్దరు వృద్ధులు మృతిచెందారు.

Rahul Gandhi: మధ్యప్రదేశ్‌లో 150 సీట్లు గెలుస్తాం, బీజేపీని కర్ణాటకలో మాదిరిగా ఇంటికి సాగనంపుతామని ధీమా వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ