త్వరలో జరగబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి తాము అంతర్గత సమీక్ష నిర్వహించామని... కర్ణాటకలో 136 సీట్లు గెలిచామని, మధ్యప్రదేశ్ లో 150 సీట్లు గెలుస్తామని చెప్పారు.

మధ్యప్రదేశ్ కు చెందిన పార్టీ కీలక నేతలు ఈరోజు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో భేటీ అయ్యారు. భేటీ అయిన వారిలో మధ్యప్రదేశ్ పార్టీ చీఫ్ కమల్ నాథ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కమల్ నాథ్ మాట్లాడుతూ ఎన్నికలకు 4 నెలల సమయం మాత్రమే ఉందని చెప్పారు. మధ్యప్రదేశ్ భవిష్యత్తు, ప్రధాన సమస్యలపై సమావేశంలో చర్చించామని తెలిపారు.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)