కర్ణాటక రాజధాని బెంగళూరులో షాప్‌లో చీరలు దొంగిలించిందని ఆరోపణతో ఒక మహిళపై అమానుష దాడి జరిగింది. మాయా సిల్క్స్ శారీస్ అనే దుకాణంలో ఈ నెల 20న మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుమారు రూ.91,500 విలువైన 61 చీరలను దొంగిలిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయింది. దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిటీ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తర్వాతి రోజు సదరు మహిళ మళ్లీ ఆ దుకాణం వైపు రావడంతో.. షాప్ యజమాని తన సిబ్బందితో కలిసి ఆమెపై దాడి చేశారు. రోడ్డుపైకి ఈడ్చి, కాళ్లతో తంతూ దారుణంగా కొట్టారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు ఫిర్యాదు మేరకు సదరు మహిళను అరెస్ట్ చేసి, దొంగిలించిన చీరలను స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, మహిళపై దాడి చేసిన షాప్ యజమాని, సిబ్బంది పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు.దీంతో పోలీసులు షాప్ యజమాని, సిబ్బందిని అరెస్ట్ చేసి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకున్నారు.
Woman Allegedly Caught Stealing Saree Beaten by Bengaluru Shop Owner,
ಅವೆನ್ಯೂ ರಸ್ತೆಯಲ್ಲಿ ಹೇಳೋರು ಕೇಳೋರು ಯಾರು ಇಲ್ಲ ಅನ್ನೋ ಆಗಿದೆ.. 😡
ಇವರದೇ ದರ್ಬಾರ್..
ಮಾರ್ವಾಡಿಗಳ ದಬ್ಬಾಳಿಕೆ ನೋಡಿ.. 😡
ಬಾಬುಲಾಲ್ ಅನ್ನೋ ಇವನ ಮೇಲೆ ಕ್ರಮ ಆಗಲಿ..
ಈ ರೀತಿ ಅಸಹಾಯಕ ಹೆಣ್ಣುಮಗಳ ಮೇಲೆ ಶೂ ಕಾಲಲ್ಲಿ ಒದ್ದು ದೌರ್ಜನ್ಯ..
ಕೂಡಲೇ ಇವನ ಬಂಧನ ಆಗಲೇಬೇಕು..@BlrCityPolice @cottonpeteps pic.twitter.com/wolUNbM7Gi
— ರೂಪೇಶ್ ರಾಜಣ್ಣ(RUPESH RAJANNA) (@rajanna_rupesh) September 25, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)