మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జలగావ్ జిల్లాలో పరండా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు. కాగా పుష్పక్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో మంటలు చెలరేగాయన్న వదంతులతో ప్రయాణికులు భయాందోళనలకు గురై చైన్ లాగి కిందికి దిగారు. అయితే పట్టాలు దాటుతున్న ఆ ప్రయాణికులను మరో ట్రాక్ మీద వేగంగా దూసుకొచ్చిన కర్ణాటక ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే స్పందించి, ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, దంపతులు వెళుతున్న బైకును ఢీకొట్టిన లారీ, ఇద్దరు అక్కడికక్కడే మృతి
Maharashtra Train Accident:
Maharashtra | At least 8 passengers of Pushpak Express were hit by Karnataka Express coming from the other side. The passengers have suffered serious injuries. More details awaited. https://t.co/EN1fvJz2j4
— ANI (@ANI) January 22, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)