Businessman Killed in Delhi: వివాహేతర సంబంధం, ఢిల్లీలో వ్యాపార వేత్త దారుణ హత్య, కాబోయే భర్తతో కలిసి ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు, ఢిల్లీలో హత్య..గుజరాత్‌లో డెడ్ బాడీ

ఢిల్లీలో వివాహేతర సంబంధంతో వ్యాపారవేత్త దారుణ హత్యకు (Businessman Killed in Delhi) గురయ్యారు. ప్రియురాలికి పెళ్లి కుదరడంతో ఒప్పుకోకపోయిన ప్రియుడుని కాబోయే భర్తతో కలిసి ప్రియురాలు హత్య చేయించింది.

Businessman Killed in Delhi: వివాహేతర సంబంధం, ఢిల్లీలో వ్యాపార వేత్త దారుణ హత్య, కాబోయే భర్తతో కలిసి ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు, ఢిల్లీలో హత్య..గుజరాత్‌లో డెడ్ బాడీ
Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

New Delhi, Nov 19: ఢిల్లీలో వివాహేతర సంబంధంతో వ్యాపారవేత్త దారుణ హత్యకు (Businessman Killed in Delhi) గురయ్యారు. ప్రియురాలికి పెళ్లి కుదరడంతో ఒప్పుకోకపోయిన ప్రియుడుని కాబోయే భర్తతో కలిసి ప్రియురాలు హత్య చేయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఢిల్లీలో నీరజ్‌ గుప్తా అనే వ్యాపారవేత్త వాయువ్య ఢిల్లీలో ఆదర్శ్‌ నగర్‌లో ఉంటున్నాడు. అయితే అతని దగ్గర ఫైసల్‌ పనిచేస్తుండేది. గత 10 సంవత్సరాలుగా అతనితో వివాహేతర సంబంధం కలిగి ఉందని వెల్లడైంది.

అయితే పైజల్‌కు జుబేర్‌ అనే వ్యక్తితో నిశ్చితార్థం అయింది. ఈ విషయం తెలిసిన నీరజ్ గుప్తా అభ్యంతరం తెలపాడు. ఈ నేపథ్యంలోనే నవంబరు 13న ఆదర్శ్ నగర్ లో కేవాల్ పార్క్ ఎక్స్‌టెన్షన్‌లో పైజల్‌ అద్దె ఇంటికి వచ్చి తల్లి, జుబెర్, తీవ్ర వాగ్వాదానికి దిగాడు. వారి మధ్య వాగ్వాదం తీవ్ర కావడంతో ఫైజల్ కాబోయే భర్త గుప్తా తలపై ఇటుకతో కొట్టి , కడుపులో పొడిచిన తరువాత అతని గొంతును కోశారు. మృతదేహాన్ని తరలించడంలో పైజల్.‌ ఫైజల్‌ తల్లి జుబెర్‌కు సహయాన్ని అందించారు.

పదేళ్లుగా 50 మందికి పైగా బాలికలపై అత్యాచారం, యూపీలో దారుణ ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన సీబీఐ, పెద్ద ఎత్తున సీడీలు, వీడియోలు స్వాధీనం

అతని మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ఉంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో తీసుకెళ్లారు. గుజరాత్‌ భరూచ్‌ సమీపంలో రైలు నుంచి బయటకు విసిరేశారు. ఆ తరువాత ఏం తెలియనట్లు ఉన్నారు. ఇక గుప్తా భార్య తన భర్త కనిపించడం లేదని, ఈ ఘటన వెనుక ఫైజల్‌ అనే మహిళ ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కోణంలో విచారించగా గుప్తాను హత్య చేసినట్లు తేలింది. ఇందులో పైజల్‌ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన నిందితులు పైజల్‌ (29), ఆమె తల్లి షాహీన్ నాజ్ (45), కాబోయే భర్త జుబెర్ (28)ను అరెస్టు చేసినట్లు నార్త్‌వెస్ట్ జోన్‌ డిప్యూటీ పోలీస్ కమిషనర్ విజయంత ఆర్య తెలిపారు.

(The above story first appeared on LatestLY on Nov 19, 2020 01:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).