8th Pay Commission: పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట.. కరువు భత్యం (DA) 8% పెంపు.. 50 శాతానికి చేరిన డిఏ..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పంజాబ్ ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే కరువు భత్యాన్ని (డీఏ) ఏకంగా 8 శాతం పెంచుతున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ తాజా సవరణతో రాష్ట్రంలో ప్రస్తుతం 42 శాతంగా ఉన్న కరువు భత్యం ఒకేసారి 50 శాతానికి చేరింది.
8th Pay Commission: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పంజాబ్ ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే కరువు భత్యాన్ని (డీఏ) ఏకంగా 8 శాతం పెంచుతున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ తాజా సవరణతో రాష్ట్రంలో ప్రస్తుతం 42 శాతంగా ఉన్న కరువు భత్యం ఒకేసారి 50 శాతానికి చేరింది.
ఈ పెరిగిన డీఏ సెప్టెంబర్ 1, 2026 నుండి అమలులోకి వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఉద్యోగులు తమ సెప్టెంబర్ 2026 జీతంతో పాటే ఈ పెరిగిన కరువు భత్యాన్ని పొందుతారని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గొప్ప ఊరట లభించనుంది. ఈ పెంపు కారణంగా రాష్ట్ర ఖజానాపై ఏటా రూ. 3,000 కోట్ల మేర అదనపు భారం పడనుంది.
ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. DA 50 శాతానికి పెంపు.. అక్టోబర్ 1 నుంచి అమలు
కాగా, గతంలో పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ బాకీలకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ఈ విషయంపై మంగళవారం స్పందించిన ప్రభుత్వం, ఈ కేసు న్యాయస్థాన పరిధిలో ఉన్నందున అన్ని వర్గాలు కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ, న్యాయస్థానం తీర్పుతో సంబంధం లేకుండా ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చొరవతో ఈ 8 శాతం పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
సాధారణంగా డీఏ 50 శాతానికి చేరుకున్నప్పుడు ఉద్యోగుల ఇతర అలవెన్సుల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉన్నందున, పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిర్ణయం పట్ల తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.