#9pm9minute: లైట్లు ఆర్పే సమయం గుర్తుంది కదా, ట్విట్టర్ వేదికగా మరోసారి గుర్తు చేసిన ప్రధాని మోదీ, రాత్రి 9 గంటల 9 నిమిషాలకు విద్యుత్ దీపాలు ఆర్పి దీప జ్యోతులు వెలిగించాలని పిలుపు

కరోనావైరస్ (Coronavirus in India) దేశంలో పంజా విప్పిన నేపథ్యంలో ఇండియా (India) మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi) ఏప్రిల్ 5న రాత్రి 9 గంటల 9 నిమిషాలకు లైట్లు ఆర్పివేసి దేశం మొత్తం కరోనావైరస్ ని ( Coronavirus) తరిమేందుకు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ (PM Modi Twitter) వేదికగా కర్తవ్య బోధను జాతికి మరోసారి గుర్తు చేశారు.

#9pm9minute: లైట్లు ఆర్పే సమయం గుర్తుంది కదా, ట్విట్టర్ వేదికగా మరోసారి గుర్తు చేసిన ప్రధాని మోదీ, రాత్రి 9 గంటల 9 నిమిషాలకు విద్యుత్ దీపాలు ఆర్పి దీప జ్యోతులు వెలిగించాలని పిలుపు
PM Narendra Modi s reminder on Sunday’s lights off (Photo-ANI)

New Delhi,April 15: కరోనావైరస్ (Coronavirus in India) దేశంలో పంజా విప్పిన నేపథ్యంలో ఇండియా (India) మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi) ఏప్రిల్ 5న రాత్రి 9 గంటల 9 నిమిషాలకు లైట్లు ఆర్పివేసి దేశం మొత్తం కరోనావైరస్ ని ( Coronavirus) తరిమేందుకు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ (PM Modi Twitter) వేదికగా కర్తవ్య బోధను జాతికి మరోసారి గుర్తు చేశారు.

ప్రధాని మోదీ 9 నిమిషాల మెసేజ్ రహస్యం

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో జాతి ఐక్యతా సందేశం కోసం ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ దీపాలు ఆర్పి దీప జ్యోతులు వెలిగించాలని పిలుపు నిచ్చిన విషయం విదితమే. ఆదివారం ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ మరోసారి గుర్తు చేశారు. #9pm9minute అని సంక్షిప్త సందేశాన్ని ట్వీట్ చేశారు.

దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం

కరోనా మహమ్మారి నేపథ్యంలో జాతి ఐక్యతా మంత్రం కోసం వారి వారి ఇళ్ల ముందు నిలబడి రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ దీపాలను ఆర్పేసి దీపాలను (Lets light a lamp) లేదా క్యాండిల్స్‌ను లేదా సెల్‌ఫోన్ టార్చి లైటును వెలిగించాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పిలుపునిచ్చారు. మోదీ నిర్ణయాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు.

Here's PM Narendra Modi Tweet

ఏప్రిల్ 5 న రాత్రి 9 గంటలకు లైట్లు ఆపి 9 నిమిషాలు పాటు కొవ్వొత్తి వెలిగించాలని దేశానికి విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి (AP CM YS Jagan) ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని పిలుపునకు మద్దతుగా రేపు రాత్రి (ఆదివారం) 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని ట్విట్టర్‌ ద్వారా రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.

Here's PM Tweet

సీఎం జగన్‌ ట్వీట్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. సీఎం జగన్‌ మద్దతు.. కరోనాపై మనందరం కలిసి పోరాడాలన్న స్ఫూర్తినిస్తుందంటూ ట్విట్టర్‌లో మోదీ పేర్కొన్నారు.

(The above story first appeared on LatestLY on Apr 05, 2020 02:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).