PM Narendra Modi (Photo Credits: PTI)

New Delhi, April 4: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ నిన్న దేశ ప్రజలకు వీడియో ద్వారా ఓ మెసేజ్ ఇచ్చిన విషయం విదితమే. దేశ ప్రజలంతా ఏప్రిల్ 5 న రాత్రి 9 గంటలకు లైట్లు ఆపి 9 నిమిషాలు పాటు కొవ్వొత్తి వెలిగించాలని దేశానికి విజ్ఞప్తి చేసిన ఒక రోజు తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ తన గురువు, మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) వీడియోను ట్విట్టర్‌లో (PM Narendra Modi Tweets) పంచుకున్నారు.

దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం

"ఆవో ఫిర్ సే దియా జలాయే" (Aao Fir Se Diya Jalaye) (మళ్ళీ కొవ్వొత్తి వెలిగించుకుందాం) అంటూ దివంగత ప్రధాని వాజ్‌పేయి తన దిగ్గజ కవితను (Atal Bihari Vajpayee Poem) పఠించే వీడియోను ప్రధాని పంచుకున్నారు. 50 సెకన్ల క్లిప్‌లో, వాజ్‌పేయి తన కవితను శీర్షికతో పఠించడం కనిపిస్తుంది; "మనమంతా కలిసి కరోనా యొక్క చీకటిని సవాలు చేయాలి." అంటూఈ వీడియోని బిజెపి అధికారిక ట్విట్టర్లో బీజేపీ పార్టీ (BJP) కూడా అదే వీడియోను ట్వీట్ చేసింది.

Here's the Video Tweeted by PM Narendra Modi:

దేశంలో కరోనావైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి తమ సంఘీభావం చూపించడానికి ఆదివారం రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు కొవ్వొత్తి, లేదా మొబైల్ ఫ్లాష్ లైట్ ఏదైనా వెలిగించాలని ప్రధాని (Narendra Modi) కోరారు. ఏప్రిల్ 5 న రాత్రి 9 గంటలకు మీ ఇళ్లలోని అన్ని లైట్లను తొమ్మిది నిమిషాలు ఆపివేసి, కొవ్వొత్తి, దియా లేదా మీ మొబైల్‌ను వెలిగించాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నానంటూ శుక్రవారం, ప్రధానమంత్రి ఓ చిన్న వీడియోను దేశ ప్రజల కోసం విడుదల చేశారు.

తెలుగు సినీ హీరోలను మెచ్చుకున్న ప్రధాని

కా గా బిజెపి ఎన్నికల పరాజయం తరువాత లాల్ కృష్ణ అద్వానీ వాజ్‌పేయిని ఢిల్లీలోని గోల్చా సినిమాకు తీసుకెళ్లినప్పుడు, అతనిని ఉత్సాహపరిచేందుకు ఆశ మరియు సానుకూలత గురించి ఈ కవిత రాసినట్లు ఐఎఎన్ఎస్ నివేదిక పేర్కొంది. అప్పుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, దివంగత మాజీ ప్రధాని ఈ కవితను వ్రాశాడు. దానిపేరే "మరోసారి దీపం వెలిగించుకుందాం".