PM Modi Telugu Tweet: తెలుగు సినీ హీరోలను మెచ్చుకున్న ప్రధాని, తెలుగులో ట్వీట్ చేసిన పీఎం మోదీ, వి కిల్ కరోనా..వి ఫైట్ విత్ కరోనా అంటూ కరోనాపై చిరంజీవి, నాగార్జున, ఇతర హీరోలు సాంగ్
File image of PM Narendra Modi (Photo Credits: ANI)

New Delhi, April 4: కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు (Global) విలవిలాలాడుతున్నాయి. కరోనా వైరస్ అరికట్టడానికి ప్రపంచమంతా ఇప్పుడు కృషి చేస్తుంది. ఈ మహమ్మారి విషయంలో అశ్రద్ధ వహిస్తే పెనుభూతంగా మారడం ఖాయం. అందుకే, కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా 21 రోజులపాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ (Lockdown) విధించింది. ఇళ్లలో నుంచి ప్రజలు భయటికి రావొద్దని, సామాజిక దూరం పాటిస్తే కరోనాను నిర్మూలించవచ్చని పిలుపునిచ్చింది.

ఈ ఆదివారం ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ ఆఫ్ చేసి జ్యోతులు వెలిగించాలి : PM Modi

ఇందులో భాగంగానే అందరూ అందరు ముందుకొచ్చి తమవంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అధ్యక్షతన తెలుగు సినిమా నటులు మొత్తం ఒక్కొక్కరుగా ముందుకొచ్చి కరోనాను అంతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. సంగీత దర్శకుడు కోటి స్వరకల్పనలో చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఓ పాటలో కూడా కనిపించారు. వి కిల్ కరోనా.. వి ఫైట్ విత్ కరోనా అంటూ వాళ్లు చేసిన ఈ పాట ఇప్పుడు ప్రధాని మోదీ (PM Narendra modi) వరకు వెళ్లింది. దీన్ని గుర్తించిన ఆయన తెలుగులో ట్వీట్ చేసారు.

Here's PM Modi Tweet

చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ ( Nagarjuna), వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు.

అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.

అందరం సామాజిక దూరం పాటిద్దాం.

కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం.. అని ప్రధాని మోదీ ట్వీట్ చేసారు

ఈ పాట వీడియోను డీడీ న్యూస్ ఏప్రిల్ 2న ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం చూసి వెంటనే స్పందించారు. తెలుగు భాషలో ట్వీట్ చేశారు. తమ హీరోల వీడియోను ప్రధాన మంత్రి మెచ్చుకోవడంతో పాటు వారికి ధన్యవాదాలు తెలపడంతో మెగా అభిమానులతో పాటు అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.