Tirupati Laddu Dispute: వీడియో ఇదిగో, తిరుపతి లడ్డూ ఘటనలో మాది తప్పు అని నిరూపిస్తే నీ బూట్లు తుడుస్తా, పవన్ కళ్యాణ్ కు ఛాలెంజ్ విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు
లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా అని ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదని, తప్పు చేసినవాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేపడతారని విమర్శించారు. టీటీడీ లడ్డూపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందేనని అన్నారు. తప్పు జరిగిపోయిందని ఆంధ్రజ్యోతి, ఈనాడు ముందే రాసేస్తున్నాయని దుయ్యబట్టారు.
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. హిందుత్వాన్ని రెచ్చగొట్టడానికే చంద్రబాబు ఆరోపణ చేశారనిస్పష్టమైపోయిందన్నారు. డీఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని చంద్రబాబు అంటున్నారని.. టీటీడీ ప్రసాదం తయారీపై పెద్ద ఆరోపణ చేసి, డీఐజీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తారా? అని ప్రశ్నించారు.
ఈ మేరకు గుంటూరులో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా అని ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదని, తప్పు చేసినవాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేపడతారని విమర్శించారు. టీటీడీ లడ్డూపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందేనని అన్నారు. తప్పు జరిగిపోయిందని ఆంధ్రజ్యోతి, ఈనాడు ముందే రాసేస్తున్నాయని దుయ్యబట్టారు.
వీడియోలు ఇవిగో, సనాతన ధర్మం కోసం చనిపోవడానికైనా రెడీ, పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
‘టీటీడీ లడ్డూలో కల్తీ జరగలేదని పవన్ నిరూపించలేదు. మత ఘర్షణలు రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆరోపణలను నిరూపించే శక్తి లేక హంగామా చేస్తున్నారు.
Here's Videos
మాజీ మంత్రి అంబటి రాంబాబు – తిరుమల లడ్డూ ఘటనలో మాది తప్పు అని నిరూపిస్తే బూట్లు తుడుస్తా#AmbatiRambabu #TirupathiLaddu #Tirupathiladducontraversy #ysrcp #Aadhantelugu pic.twitter.com/3RQQGIYppN
— Aadhan Telugu (@AadhanTelugu) September 25, 2024
.@ncbn తన తండ్రి చనిపోయినప్పుడు కనీసం తలనీలాలు ఇవ్వలేదు. అలాంటి వ్యక్తికి సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?
లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా? అనే ప్రశ్నకు ఇప్పటి వరకు సమాధానం చెప్పడం లేదు
తప్పు చేసినవాళ్లు కదా ప్రాయశ్చిత్త దీక్ష చేపడతారు.. మరి నువ్వు ఎందుకు చేస్తున్నట్లు… pic.twitter.com/nl1Cg65GwR
— YSR Congress Party (@YSRCParty) September 24, 2024
ఈ ప్రాయశ్చిత్త దీక్ష డ్రామాలు ఎందుకు @PawanKalyan.. సిట్టింగ్ జడ్జి అధ్యక్షతన విచారణకి అంగీకారం చెప్పండి చాలు
డీఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని చంద్రబాబు నాటకాలు ఆడుతున్నాడు
లడ్డుపై తీవ్రమైన ఆరోపణలు చేసి.. నిరూపించలేక @ncbn కంగారుపడుతున్నాడు
-అంబటి రాంబాబు, మాజీ… pic.twitter.com/DKXZx1iX3N
— YSR Congress Party (@YSRCParty) September 24, 2024
హిందూ సంప్రదాయల గురించి చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యం. తండ్రి చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు తలనీలాలు ఇవ్వలేదు. సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు’ అని మండిపడ్డారు.
(The above story first appeared on LatestLY on Sep 25, 2024 01:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

