Amit Mishra Pays Money to Fan: గర్ల్‌ ఫ్రెండ్‌తో డేట్ కోసం ఫ్యాన్‌కు డబ్బులు పంపిన క్రికెటర్, ట్విట్టర్‌లో డబ్బులు అడిగితే గూగుల్ పే చేసిన టీమిండియా లెగ్ స్పిన్నర్, రూ.300 అడిగతే రూ. 500 పంపి ఆల్‌ ది బెస్ట్ చెప్పిన మిశ్రా, అతను చేసిన పనికి నెటిజన్ల నుంచి వింత రియాక్షన్లు

ఈ ట్వీట్‭తో సంబంధం లేకుండా తన ప్రేయసిని డేట్‭కు తీసుకెళ్తున్నానని, 300 రూపాయలు ఇవ్వాలని కోరాడు. అంతే.. వెంటనే అతడి గూగుల్ పేకి (Google pay) 500 రూపాయలు పంపించాడు మిశ్రా. అనంతరం అది స్క్రీన్‭షాట్ తీసి ట్విట్టర్‭లో షేర్ చేశాడు. ‘‘అయిపోయింది, మీ డేట్‭కి ఆల్ ది బెస్ట్’’ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Delhi, SEP 29: సోషల్ మీడియాలో అభిమానులతో ఇతర నెటిజెన్లతో (Netizens) కొంత మంది సెలెబ్రిటీలు సరదాగా ఉంటారు. ఇందులో మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా (Amit Misra) ఒకరు. జోకులతో, ఆసక్తికరమైన విశయాలతో తన ఫాలోవర్స్‭ని (Followers) ఎప్పటికప్పుడు వినోదాన్ని అందిస్తుంటాడు మిశ్రా. అయితే తాజాగా ఒక నెటిజెన్ డబ్బులు అడిగితే వెంటనే రెస్పాండ్ అయి.. డిజిటల్ పేమెంట్ (Digital Payment) ద్వారా డబ్బులు పంపించాడు. డబ్బులు తీసుకున్న ఆ నెటిజెనే కాకుండా మిగతా వారిలో కూడా ఈ వార్త కాస్త ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు కాస్త క్యూరియాసిటీని పెంచింది. ఈ మధ్యే సురేష్ రైనాకు సంబంధించిన ఒక వీడియోను మిశ్రా తన ట్విట్టర్ (Twitter) ఖాతాలో షేర్ చేశాడు.

అయితే ఈ ట్వీట్‭తో సంబంధం లేకుండా తన ప్రేయసిని డేట్‭కు తీసుకెళ్తున్నానని, 300 రూపాయలు ఇవ్వాలని కోరాడు. అంతే.. వెంటనే అతడి గూగుల్ పేకి (Google pay) 500 రూపాయలు పంపించాడు మిశ్రా. అనంతరం అది స్క్రీన్‭షాట్ తీసి ట్విట్టర్‭లో షేర్ చేశాడు. అనంతరం ‘‘అయిపోయింది, మీ డేట్‭కి ఆల్ ది బెస్ట్’’ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement