Andhra Pradesh Horror: చెల్లెలు పాలిట కామాంధుడుగా మారిన అన్న, రోజు బడి నుంచి ఇంటికి రాగానే అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక

ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి చూసింది. చెల్లెలు పాలిటే అన్నే కామాంధుడు అయ్యాడు. ఏకంగా ఆమెను గర్భవతిని చేశాడు. ఈ అత్యాచార ఘటనపై స్థానిక పోలీసలు కేసు నమోదు చేశారు

Andhra Pradesh Horror: చెల్లెలు పాలిట కామాంధుడుగా మారిన అన్న, రోజు బడి నుంచి ఇంటికి రాగానే అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక
Rape (Photo-Rep)

Prakasam, Nov 1: ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి చూసింది. చెల్లెలు పాలిటే అన్నే కామాంధుడు అయ్యాడు. ఏకంగా ఆమెను గర్భవతిని చేశాడు. ఈ అత్యాచార ఘటనపై స్థానిక పోలీసలు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం తాళ్లూరు మండలంలోని ఓ గ్రామంలోని బాలిక అక్కడే ఉన్న జడ్పీ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్‌లో తోటి విద్యార్థులతో రోజూ చాటింగ్‌ చేస్తూ ఉండేది.

ఈ క్రమంలో అదే పాఠశాలకు చెందిన ఓ బాలుడితో ఫోన్లో చనువుగా ఉంటోంది. ఈ విషయం అదే స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాలిక అన్నకి తెలిసింది. తన చెల్లెలి విషయం తల్లిదండ్రులకు చెబుతానంటూ బెదిరించి ఆమెపై కొంత కాలంగా అత్యాచారం చేశాడు. ఇటీవల బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

తెలంగాణలో దారుణం, 8వ తరగతి విద్యార్థినిపై నలుగురు మైనర్లు అత్యాచారం, నిందితులు అరెస్ట్

వైద్య పరీక్షల్లో ఆ బాలిక గర్భవతిగా గుర్తించారు. ఆస్పత్రి సిబ్బంది స్త్రీ శిశుసంక్షేమ శాఖకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు వివరాల అందించారు. బాలిక గర్భవతిగా నిర్ధారణ కావడంతో ఆమెను తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించడంతో సోదరుడి నిర్వాకాన్ని వివరించింది. వైద్యులకు జరిగిన విషయాన్ని వివరించడంతో తల్లిదండ్రుల సమ్మతితితో ఆమెకు అబార్షన్‌ చేయించారు. మెరుగైన చికిత్స కోసం బాలికను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న దర్శి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం కేసులో బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలిస్తామని తెలిపారు.

(The above story first appeared on LatestLY on Nov 01, 2024 02:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).