Assam Boat Tragedy: బ్ర‌హ్మ‌పుత్ర న‌దిలో ఘోర ప్రమాదం, ఒకదానికొకటి ఢీ కొన్న రెండు పడవలు, 100 మంది గల్లంతైనట్లు వార్తలు, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం హిమంత బిస్వా శర్మ

అసోంలోని బ్ర‌హ్మ‌పుత్ర న‌ది ( Brahmaputra ) లో బుధ‌వారం ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. బ్రహ్మాపుత్ర నదిలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు ఒకదానికొకటి ఢీకొని (Assam Boat Tragedy) బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో దాదాపు వంద మంది నీటిలో గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయి.

Assam Boat Tragedy: బ్ర‌హ్మ‌పుత్ర న‌దిలో ఘోర ప్రమాదం, ఒకదానికొకటి ఢీ కొన్న రెండు పడవలు, 100 మంది గల్లంతైనట్లు వార్తలు, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం హిమంత బిస్వా శర్మ
Assam Boat Tragedy (Photo-ANI)

Guwahati, Sep 8: అసోంలోని బ్ర‌హ్మ‌పుత్ర న‌ది ( Brahmaputra ) లో బుధ‌వారం ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. బ్రహ్మాపుత్ర నదిలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు ఒకదానికొకటి ఢీకొని (Assam Boat Tragedy) బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో దాదాపు వంద మంది నీటిలో గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయి. జోర్హాత్‌ జిల్లా నీమాటిఘాట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మజులి నుంచి నీమాటిఘాట్‌కు వెళ్తున్న ఓ పడవ.. తిరుగు ప్రయాణం చేస్తున్న ఓ పడవ రెండూ ఢీకొన్నాయి.

బోల్తా పడడంతో పడవల్లోని కొందరు ప్రయాణికులు ఈదుతూ ఒడ్డుకు చేరారు. ఈత రాని వారు మునిగిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు (ఎన్డీఆర్‌ఎఫ్‌- ఎస్డీఆర్‌ఎఫ్‌) రంగంలోకి దిగారు. నీటిలో గల్లంతయిన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. ఈ ఘటనపై కేంద్ర షిప్పింగ్‌, ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో వెంటనే ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మ‌జులీ, జోర్హ‌త్ జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేశారు.

కూర బాలేదన్న భర్త, కోపంతో రాడ్‌తో అతని తల పగలగొట్టిన భార్య, హర్యానాలో దారుణ ఘటన, భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

ఘటనకు గల కారణాలు కూడా తెలుసుకుంటున్నారు. నదిలో ఈ రెండు పడవలు ఢీకొన్నాయని సమాచారం. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో నది ప్రవాహం అధికంగా ఉండడం వలన ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.

(The above story first appeared on LatestLY on Sep 08, 2021 07:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).