Bihar: లేటు వయసులో ఒక్కటైన దంపతులు, మహిళా న్యాయవాది నూతన్‌ను వివాహమాడిన న్యాయమూర్తి శివపాల్ సింగ్, సోషల్ మీడియాలో ఫోటోలు వీడియో వైరల్
దాణా కుంభకోణం కేసులో మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ శిక్ష విధించిన న్యాయమూర్తి శివపాల్ సింగ్ 59 ఏళ్ల వయస్సులో పెళ్లి కొడుకుగా మారారు. రిటైర్ కాబోతున్న వయస్సులో 50 ఏళ్ల మహిళా న్యాయవాదిని రెండో వివాహం చేసుకున్నారు.
- Read in
- తెలుగు
దాణా కుంభకోణం కేసులో మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ శిక్ష విధించిన న్యాయమూర్తి శివపాల్ సింగ్ 59 ఏళ్ల వయస్సులో పెళ్లి కొడుకుగా మారారు. రిటైర్ కాబోతున్న వయస్సులో 50 ఏళ్ల మహిళా న్యాయవాదిని రెండో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాకు చెందిన జడ్జ్ శివపాల్ సింగ్ పదవీ విరమణకు ఆరు నెలల ముందు రెండో వివాహం చేసుకున్నారు.తన స్నేహితురాలు, బీజేపీ నాయకురాలు అయిన 50 ఏళ్ల న్యాయవాది నూతన్ తివారీని శివపాల్ సింగ్ వివాహం చేసుకున్నారు.
వృత్తిరీత్యా లాయర్ అయిన నూతన్ భర్త 2006లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. న్యాయమూర్తి శివపాల్ భార్య 20ఏళ్ల క్రితమే మరణించారు. శివ్‌పాల్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. నూతన్‌కు ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే వీరు వివాహం చేసుకున్నారు.
Shiv Pal Singh, Ex-CBI Special Judge Who Sentenced RJD Chief Lalu Prasad Yadav in Fodder Scam, Marries BJP Leader at 59#ShivPalSingh #ExCBIJudge #LaluPrasad #FodderScam #NationalNewshttps://t.co/rMh4ZpFXyS
— LatestLY (@latestly) September 6, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 06, 2022 07:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

